Himachal pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో రెస్క్యూ సిబ్బంది చొరవతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌ సోలాన్ జిల్లా పర్వానులో గాలిలోనే కేబుల్ కారు ఆగిపోయింది. సాంకేతిక కారణాలతో ఈఘటన చోటుచేసుకుంది. కేబుల్ కారు ఆగిపోవడంతో పర్యాటకులు భయాందోళనకు లోనయ్యారు. ప్రమాద సమయంలో కేబుల్ కారులో 11 మంది ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీనిపై సమాచారం అందుకున్న అధికారులు ..రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. సుమారు మూడు గంటలపాటు శ్రమించి అందర్నీరక్షించారు.  ఘటనాస్థలిలో రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టామని..పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని సోలాన్ జిల్లా పోలీస్ అధికారి వీరేంద్ర శర్మ వెల్లడించారు. ప్రమాదంపై నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌కు సమాచారం అందించారు. 


పర్వానులోని టింబర్ ట్రెయిల్ ప్రైవేట్ రిసార్ట్‌కు చెందిన రోప్‌ వేపై వెళ్లే కేబుల్ కార్లకు ఎంతో విశిష్టత ఉంది. శివాలిక్ పర్వత శ్రేణుల మీదుగా ఇవి వెళ్తుంటాయి. ఈటూర్‌తో పర్యాటక అందాలను వీక్షిస్తుంటారు. 1992 అక్టోబర్‌లోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో ఒకరు మృతి చెందగా..10 మందిని కాపాడారు. తాజాగా ఇప్పుడు జరగడంతో స్థానికంగా కలకలం రేగింది. 


 




Also read:Bandi Sanjay: ప్రధాని మోదీ బహిరంగసభతో తెలంగాణ బీజేపీలో జోష్‌ వచ్చేనా..?


Also read:Supreme Court Jobs: నిరుద్యోగులకు శుభవార్త..సుప్రీం కోర్టులో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్...!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook