కరోనా వైరస్ ( Corona virus ) మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. దేశంలో కోవిడ్ 19 కేసులు ( Covid19 cases ) ఒక మిలియన్ మార్కును దాటేశాయి. ఈ నేపధ్యంలో ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ ( Famous medical Journal The lancet ) దేశంలోని అత్యధిక ప్రమాదకర జిల్లాలున్న రాష్ట్రాల జాబితాను విడుదల చేసింది. ఆ రాష్ట్రాలు ఇవే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


భారతదేశంలో కోవిడ్ 19 వైరస్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటికే ఒక మిలియన్ మార్కు దాటేసింది ఆ సంఖ్య. కరోనా వైరస్ కేసుల్లో తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో అత్యధిక కేసులున్న విషయం తెలిసిందే. అయితే ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ ( Medical Journal The lancet ) ప్రకటించిన జాబితా ప్రకారం ఇది కాస్త భిన్నంగా ఉంది. కోవిడ్ 19 వైరస్ కేసులు పెరుగుతున్న రాష్ట్రాలైతే ఇవి కావచ్చు గానీ..అత్యధిక ప్రమాదక జిల్లాలు మాత్రం ఈ రాష్ట్రాల్లో లేకపోవడం గమనార్హం. Also read: AAP: వెంటిలేటర్ పై కాంగ్రెస్, ఆప్ ఒక్కటే ప్రత్యామ్నాయం


మెడికల్ జర్నల్ లాన్సెట్ విడుదల చేసిన జాబితా ( The lancet list of Dangerous districts )ప్రకారం  కోవిడ్ 19 వైరస్ ( Covid19 virus ) సంక్రమణ అత్యధిక ప్రమాదకరంగా ఉన్న జిల్లాల్లో మధ్యప్రదేశ్ ( Madhya Pradesh ) , బీహార్ ( BIhar ) , తెలంగాణ ( Telangana ) రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోని అత్యధిక జిల్లాలు అతి ప్రమాదకరంగా మారే అవకాశాలున్నట్టు లాన్సెట్ ప్రకటించింది. హౌసింగ్, పరిశుభ్రత, ఆరోగ్య వ్యవస్థ లాంటి ముఖ్యమైన అంశాల్ని పరిగణలో తీసుకుని లాన్సెట్ ఈ అంచనాకు వచ్చింది. ఢిల్లీలోని పాపులేషన్ కౌన్సిల్ (Delhi population Council ) కు చెందిన రాజీబ్ ఆచార్య సహా పలువురు శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. Also read: Covid-19 Tests: ఆమెరికా తరువాత భారత్‌లోనే అత్యధిక కోవిడ్-19 పరీక్షలు


మధ్యప్రదేశ్, బీహార్, తెలంగాణ రాష్ట్రాల్లోని జిల్లాల తరువాతి స్థానంలో జార్ఖండ్ ( Jharkhand ), ఉత్తరప్రదేశ్ ( Uthar Pradesh ) , మహారాష్ట్ర ( Maharashtra ) , పశ్చిమ బెంగాల్ ( West Bengal ) , ఒడిశా ( Odisha ) , గుజరాత్ ( Gujarat )  రాష్ట్రాల్లోని జిల్లాలు ఎక్కువగా ప్రభావితం కానున్నాయి. ది లాన్సెట్ జర్నల్ చేసిన అధ్యయనంలో వైరస్ వ్యాప్తి, కేసుల సంఖ్య, మరణాలు, సామాజిక, ఆర్ధిక ప్రభావం, సంక్రమణ పరిణామాల్ని పరిశీలనలో తీసుకున్నారు. కరోనా సంక్రమణ ప్రభావం తక్కువ ప్రమాదకరంగా ఉన్న జిల్లాలు సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ లున్నాయి. 


తాము చేసిన ఈ అధ్యయనం ఆయా రాష్ట్రాల్లో భవిష్యత్ వ్యూహం అవలంభించడానికి దోహదపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కరోనా మహమ్మారి కట్టడిలో పాటించాల్సిన విధానాల గురించి తెలుస్తుందన్నారు.