All kinds of Firecrackers Ban in Delhi NCR: ఢిల్లీ: ప్రతీ ఏడాది దీపావళి (deepavali 2020) పర్వదినం కోసం భారతీయులంతా ముందుస్తుగానే సిద్ధం అవుతుంటారు. అయితే కరోనా (Coronavirus) మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతుండటంతో.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను మరింత దిగజారుతాయని గమనించి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే టపాసులు కాల్చడంపై నిషేధం (Diwali Firecrackers ban) విధిస్తూ చర్యలు తీసుకున్నాయి. అయితే ఢిల్లీలో కొంతకాలం నుంచి వాయు కాలుష్యం (air pollution) విపరీతంగా పెరిగింది. దీపావళి టపాసులు కాల్చడం వల్ల ఈ సమస్య మరింత పెరిగే అవకాశముందని ఢిల్లీ ప్రభుత్వం కూడా టపాసులపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ క్రమంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (National Green Tribunal) కూడా.. దేశ రాజదాని ఢిల్లీ - ఎన్‌సీఆర్ (Delhi-NCR) తదితర ప్రాంతాల్లో ఈ రోజు అర్థరాత్రి నుంచి (నవంబరు 9) నుంచి నవంబరు 30 వరకు అన్నిరకాల టపాసుల అమ్మకాలు, వినియోగంపై సంపూర్ణ నిషేధం విధిస్తూ సోమవారం ఉత్తర్వులిచ్చింది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గాలి నాణ్యత తక్కువగా ఉండే దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఈ అదేశాలే వర్తిస్తాని ఎన్‌జీటీ ట్రిబ్యూనల్ చైర్మన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ ధర్మాసనం స్పష్టంచేస్తూ ఆదేశాలిచ్చింది. గాలి నాణ్యత సాధారణంగా ఉండే ప్రాంతాల్లో కేవలం హరిత టపాసులను అమ్మాలని ఆదేశాలిచ్చింది. కోవిడ్ వ్యాప్తి మరింత పెరిగే ప్రమాదం ఉన్నందున కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలని సూచించింది. Also read: Firecrackers in Diwali: టపాసులపై బ్యాన్ విధించిన 6 రాష్ట్రాలు..లిస్ట్ చెక్ చేయండి!


అయితే కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి పెరుగుతోందని.. ఈ క్రమంలోనే వాయు కాలుష్యం కూడా ప్రమాదకరంగా మారుతోందని దీనిపై చర్యలు తీసుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌లో పిటిషన్ దాఖలైంది. దీనిని విచారించిన ట్రిబ్యూనల్ (NGT) ఈ విధంగా ఉత్తర్వులిస్తూ నిర్ణయం తీసుకుంది. Also read: Telangana: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి


 


వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe