Telangana: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

తెలంగాణ (Telangana) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident ) సంభవించింది. ఆగి ఉన్న లారీని కారు ఢికొట్టిన ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు (Four persons killed) కోల్పోయారు. మృతుల్లో ఇద్ద‌రు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి.

Last Updated : Nov 9, 2020, 08:42 AM IST
Telangana: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Road Accident - Four persons killed: హైదరాబాద్: తెలంగాణ (Telangana) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident ) సంభవించింది. ఆగి ఉన్న లారీని కారు ఢికొట్టిన ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు (Four persons killed) కోల్పోయారు. మృతుల్లో ఇద్ద‌రు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘోర ప్రమాదం ఆదివారం అర్థరాత్రి జగిత్యాల జిల్లా (Jagtial) కోరుట్ల మండలంలోని మోహన్‌రావుపేట వద్ద చోటుచేసుకుంది. హైద‌రాబాద్ నుంచి మ‌ల్లాపూర్ వెళ్తున్న కారు ఆదివారం రాత్రి కోరుట్ల మండ‌లం మోహ‌న్‌రావుపేట వ‌ద్ద ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్ద‌రు మ‌హిళ‌లతోపాటు రెండు, నాలుగు నెలల వయస్సున్న ఇద్ద‌రు చిన్నారులు అక్క‌డిక‌క్క‌డే మరణించారు. డ్రైవ‌ర్‌తోపాటు మ‌రొక‌రు తీవ్రంగా గాయ‌ప‌డగా.. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. Also read: Narendra Modi: షిప్పింగ్ మంత్రిత్వ శాఖ పేరు మార్పు: ప్రధాని మోదీ

సమాచారం మేరకు సంఘ‌ట‌న స్థలానికి చేరుకున్న పోలీసులు‌ క్ష‌త‌గాత్ర‌లును ఆసుపత్రికి త‌రలించారు. అయితే మృతులంతా మ‌ల్లాపూర్ వాసులు ర‌మాదేవి, ల‌త‌, చిన్నారులు శిరీష‌, చ‌ర‌ణ్‌గా గుర్తించామ‌ని పోలీసులు వెల్లడించారు. మల్లాపూర్‌కు చెందిన శ్రీనివాస్ తన బావమరిది చంద్రమోహన్‌ను దుబాయ్ పంపేందుకు రెండు కుటుంబాలతో కలిసి కారులో జగిత్యాలకు బయలు దేరారు. అయితే అక్కడ ఆయన్ను బస్సు ఎక్కించి తిరుగు ప్రయాణం కాగా మార్గం మధ్యలో ప్రమాదం జరిగింది.  Also read: Haj 2021: హజ్ యాత్రకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News