Yoga History: యోగా పుట్టింది ఇండియాలో కాదంట..నేపాల్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు
Yoga History: ప్రపంచమంతా యోగా దినోత్సవం జరుపుకుంటోంది. యోగా అంటేనే ఇండియా గుర్తొస్తుంది అందరికీ. అయితే అసలు యోగా పుట్టింది ఇండియా కాదా. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి ఈ వివాదాస్పద వ్యాఖ్యలే ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.
Yoga History: ప్రపంచమంతా యోగా దినోత్సవం జరుపుకుంటోంది. యోగా అంటేనే ఇండియా గుర్తొస్తుంది అందరికీ. అయితే అసలు యోగా పుట్టింది ఇండియా కాదా. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి ఈ వివాదాస్పద వ్యాఖ్యలే ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.
జూన్ 21. అంతర్జాతీయ యోగా దినోత్సవం( International Yoga Day). ఎన్డీయే ప్రభుత్వ హయాంలో యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. క్రమం తప్పకుండా ప్రపంచంలోని అన్ని దేశాల్లో జూన్ 21న అత్యంత ఘనంగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ తరుణంగా నేపాల్ ప్రధాని కేపీ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు యోగా అనేది ఇండియా చెబుతున్నట్టుగా ఆ దేశంలో పుట్టలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇండియా ఓ దేశంగా ఏర్పడకముందే నేపాల్‌లో(Nepal) యోగా ప్రాక్టీసు జరిగేదని తెలిపారు. యోగాను కనుగొన్నప్పటికీ ఇండియా ఏర్పడలేదన్నారు. యోగా అనేది నేపాల్ దేశంలోనే పుట్టిందంటున్నారు కేపీ శర్మ. యోగా (Yoga) కనుగొన్న పూర్వీకులెవరికీ గుర్తింపు ఇవ్వలేదని..యోగా గురువులు, సేవల గురించి మాట్లాడుకుంటుంటామని చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra modi) చొరవతోనే యోగాకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందన్నారు.
కేపీ శర్మకు (KP Sharma) వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తకాదు. గతంలో శ్రీరాముడి జన్మస్థలం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు నేపాల్‌లో పుట్టాడని...ఇండియాలోని అయోధ్యలో కాదని తెలిపారు. నేపాల్‌లోని చిత్వాన్ జిల్లా అయోధ్య పరి వద్ద వాల్మీకి ఆశ్రమంలో శ్రీరాముడు జన్మించారని చెప్పి అప్పట్లో సంచలనం సృష్టించారు. ఈ కారణంగానే నేపాల్‌లో రాముడు, సీత, లక్ష్మణ ఆలయాల్ని నిర్మించాలని ఆదేశించారు కూడా. ఇప్పుడు తాజాగా యోగా పుట్టుక గురించి మాట్లాడి సంచలనం రేపారు.
Also read: International Yoga Day 2021 Images: భారత్‌లో ఇంటర్నేషనల్ యోగా డే 2021 ఫొటోస్ గ్యాలరీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook