Delhi Government: దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారం మరింతగా తగ్గిపోనుంది. ఢిల్లీ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అని తేల్చే బిల్లును లోక్‌సభ ఆమోదం తెలిపింది. బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమంటూ ఆప్ , కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీకు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా లేదు. అందుకే శాంతిభద్రతలు పోలీసింగ్ కేంద్రం చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం అధికారం మరింతగా తగ్గనుంది. డిల్లీ అంటే లెఫ్టినెంట్ గవర్నరే అని తేల్చి చెప్పే కీలకమైన బిల్లును లోక్‌సభ (Loksabha) ఆమోదించింది. ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ టెరిటరీ ఆఫ్ డిల్లీ సవరణ బిల్లు 2021 ( GNTD)ను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి (Kishan reddy)లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఢిల్లీ ప్రభుత్వమంటే ఎవరనే విషయానికి సంబంధించిన గందరగోళాన్ని తొలగించేందుకు ఈ బిల్లు తీసుకొచ్చామని కిషన్ రెడ్డి తెలిపారు.


అయితే ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమంటూ ఆప్, కాంగ్రెస్ పార్టీలు వ్యతిరేకించాయి. రాష్ట్ర ప్రభుత్వ హక్కులను లాక్కునే ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని కాంగ్రెస్‌ ఎంపీ మనీశ్‌ తివారి విమర్శించారు. ఇది గతంలో అప్పటి హోంమంత్రి అద్వానీ ఇచ్చిన హామీలకు వ్యతిరేకమన్నారు. అసెంబ్లీ తీసుకునే నిర్ణయాలను ప్రజా ప్రభుత్వం అమలు చేయకుండా అపేందుకే ఈ బిల్లు తెచ్చారన్నారు. ఢిల్లీ ప్రభుత్వం(Delhi Government)పై గందరగోళానికి కాంగ్రెస్, ఆప్‌ కారణమని బీజేపీ ఎంపీ మీనాక్షి లేకి దుయ్యబట్టారు. కావాలనుకుంటే కాంగ్రెస్‌..అప్పట్లోనే ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వాల్సిందన్నారు.


2013లో ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ఒక వ్యక్తి వల్ల ఈ పరిస్థితి వచ్చిందని బీజేపీ ఎంపీ బ్రిజేందర్‌ సింగ్‌ పరోక్షంగా అరవింద్‌ క్రేజీవాల్‌(Arvind kejriwal)ను విమర్శించారు. అరవింద్‌ హయాంలో ఢిల్లీ పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇచ్చిఉంటే ఈ పాటికి సివిల్‌వార్‌ వచ్చేదన్నారు. రాష్ట్రాల హక్కుల్ని హరించడంలో కేంద్రం స్పెషలిస్టని, ఢిల్లీని పాలించాలని భావిస్తోందని ఆప్‌ ఎంపీ భగవంత్‌మన్‌ విమర్శించారు. జమ్ముకశ్మీర్‌లా అసెంబ్లీ ఉన్న యూటీలాగా ఢిల్లీని మార్చాలని కేంద్రం భావిస్తోందా? అని ప్రశ్నించారు. ఢిల్లీ ముఖ్యమంత్రికి ఏ నిర్ణయాధికారం లేకుంటే, అసెంబ్లీకి ఎన్నికలెందుకన్నారు. బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపాలని ఎన్‌సీపీ డిమాండ్‌ చేసింది.


కొత్త బిల్లు ప్రకారం ఢిల్లీలో ప్రభుత్వమంటే లెఫ్టినెంట్ గవర్నర్( Lieutenant governor) అనేది ఖరారు కానుంది. ఢిల్లీ ప్రభుత్వం తీసుకునే ఎలాంటి ఎగ్జిక్యూటివ్ చర్యకైనా సరే ఎల్‌జీ అనుమతి ఇక తప్పనిసరి అవుతుంది. అయితే ఇది రాజకీయ బిల్లు కాదని..కొన్ని అంశాలపై స్పష్టత కోసమే తీసుకొచ్చామని కేంద్రం చెబుతోంది. ఈ బిల్లు వల్ల రోజువారీ ప్రజాస్వామ్యానికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. నిజానికి ఈ బిల్లును 1991లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఎల్‌జీ కార్యనిర్వహణాధికారి కాబట్టి..రోజువారీ కార్యకలాపాలు తెలుసుకునే హక్కుంటుందన్నారు.


Also read: Covishield vaccine: కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య గ్యాప్ పెరిగింది..గమనించండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook