New coronavirus strain: ఆందోళన రేపుతున్న కొత్తరకం కరోనా స్ట్రెయిన్, ఆ మూడు రాష్ట్రాల్లో
New coronavirus strain:దేశంలో కరోనా కొత్త రకం వైరస్ ఆందోళన కల్గిస్తోంది. దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ కేసులు వెలుగుచూడటం భయాందోళన రేపుతోంది. కొత్తరకం కరోనా కట్టడి కోసం అధికారులు రంగంలో దిగారు.
New coronavirus strain:దేశంలో కరోనా కొత్త రకం వైరస్ ఆందోళన కల్గిస్తోంది. దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ కేసులు వెలుగుచూడటం భయాందోళన రేపుతోంది. కొత్తరకం కరోనా కట్టడి కోసం అధికారులు రంగంలో దిగారు.
కరోనా వైరస్ తగ్గిపోయిందనుకున్న తరుణంలో కొత్త కరోనా స్ట్రెయిన్( New coronavirus strain) తీవ్ర కలవరం రేపుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ కేసులు వెలుగుచూడటం ఆందోళనకు దారితీస్తోంది. మహారాష్ట్ర, కేరళ, తెలంగాణల్లో N440K, N484K వైరస్‌లు బయటపడటం కలకలం రేపుతోంది. కొత్త రకం స్ట్రెయిన్ వల్లే కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నట్టు వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, కర్ణాటకలో ఈ రకం వైరస్ ఎక్కువగా విస్తరిస్తోంది. దాంతో గత కొద్దిరోజులుగా ఊపిరి పీల్చుకుంటున్న ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. ఓవైపు దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నడుస్తుండగా..మరోసారి వైరస్ విజృంభించడం కలవరానికి గురిచేస్తోంది.
మహారాష్ట్ర ( Maharashtra )లో అత్యధికంగా కొత్త కేసులు నిర్థారణ కావడంతో కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్( Lockdown) విధిస్తున్నారు. పూణె, అమరావతి, నాగపూర్, యావత్మల్ వంటి ప్రాంతాల్లో కఠిన చర్యలకు ఉపక్రమించారు. పలు ప్రాంతాల్లో పాఠశాలల్ని సైతం మూసివేశారు. కొత్త రకం కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పంజాబ్ ప్రభుత్వం సైతం చర్యలు చేపట్టింది. పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అధికారులను ఆదేశించారు. ఇక కర్ణాటక, మహారాష్ట్రంలో కరోనా విజృంభించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆయా రాష్ట్రాలతో ఉన్న సరిహద్దు జిల్లాల్లో నిఘా పెంచాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆదేశించారు. అక్కడి నుంచే వారికి ఖచ్చితంగా పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఇక కొత్త కరోనా వైరస్ కేరళ, కర్ణాటక మధ్య వివాదాన్ని రాజేస్తోంది. కేరళలో కేసులు ఎక్కువగా నమోదవడంతో కర్ణాటక ( Karnataka )ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. కేరళ-కర్ణాటక మధ్య సరిహద్దుల్ని మూసివేశారు. ఈ నిర్ణయంపై కేరళ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యడ్యూరప్ప నిర్ణయాన్ని తప్పుబడుతూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ( Kerala cm pinarayi vijayan )ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాష్ట్రాల మధ్య సరిహద్దులను వెంటనే తెరపాలని కోరారు.
2020లో కోవిడ్ సృష్టించిన విలయం నుంచి ఇప్పుడే అంతా కోలుకుంటున్న పరిస్థితి. ఈ తరుణంలో మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తే పరిస్థితి అంచనా వేయడం కష్టసాధ్యమవుతుంది. అందుకే మరోసారి లాక్‌డౌన్ విధించాలనే ఆలోచనలో ప్రభుత్వాలున్నాయి.
Also read: Vaccination capacity: అలా చేస్తే రెండు నెలల్లో 50 కోట్ల మందికి వ్యాక్సినేషన్ : విప్రో అజీమ్ ప్రేమ్ జీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook