New COVID-19 Strain: 82కి చేరిన కొత్త రకం కరోనా కేసులు
దేశంలో కోవిడ్-19 మహమ్మారి కేసులు.. మరోవైపు కొత్తరకం కరోనావైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో తాజాగా మరో తొమ్మిది మందికి బ్రిటన్ స్ట్రైయిన్ సోకినట్లు నిర్ధారణ అయింది.
New Coronavirus Strain In India Updates | న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్-19 మహమ్మారి కేసులు.. మరోవైపు కొత్తరకం కరోనావైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో తాజాగా మరో తొమ్మిది మందికి బ్రిటన్ స్ట్రైయిన్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో దేశంలో కొత్త రకం (New strain of COVID-19) కరోనా కేసుల సంఖ్య 82కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. అయితే బుధవారం వరకూ ఈ కేసుల సంఖ్య 73 వరకూ మాత్రమే ఉండగా.. నిన్న గుర్తించిన కేసులతో (Covid-19) దీని సంఖ్య 82కి చేరింది.
కోవిడ్ న్యూ స్ట్రెయిన్ బారిన పడిన వారందరినీ రాష్ట్రాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో ఐసొలేషన్లలో ఉంచినట్టు (Health Ministry) ప్రభుత్వం వెల్లడించింది. వారితో సన్నిహిత సంబధాలున్న వారిని కూడా క్వారంటైన్‌లో ఉంచడంతో పాటు, కాంటాక్ట్ ట్రేసింగ్ జరుపుతున్నట్టు తెలిపింది. దీనిపై కేంద్రం (Central Govt) రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన సూచనలు చేస్తూ చర్యలు తీసుకుంటోంది. Also Read: India Covid-19: కొత్తగా 18వేల కరోనా కేసులు
ఇదిలా ఉంటే.. కొత్తరకం (New Covid-19 Strain) కరోనా కేసులు డెన్మార్క్, నెదర్‌ల్యాండ్స్, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్, జర్మనీ, కెనడా, జపాన్, లెబనాన్, సింగపూర్‌లో కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇదిలాఉంటే.. శుక్రవారం బ్రిటన్ నుంచి భారత్‌కు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికులను ఐసోలేషన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. Also read: COVID-19 Vaccine: తొలి టీకాను ప్రధాని మోదీ తీసుకోవాలి: ఆర్జేడీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook