Pandit Sukh Ram Passes Away: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పండిట్ సుఖ్ రామ్ (94) కన్నుమూశారు. బ్రెయిన్ స్టోక్ తో ఇటీవలే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. మంగళవారం అర్థరాత్రి తర్వాత చికిత్స పొందతూ తుదిశ్వాస విడిచారు. పండిట్ సుఖ్ రామ్ మరణవార్తను ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా పండిట్ సుఖ్ రామ్.. మే 4వ తేదీన హిమాచల్ ప్రదేశ్ మనాలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఆయన్ను.. మే 7న ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ.. మే 10 అనగా మంగళవారం రాత్రి ఆయన మరణించారు. 


కేంద్ర మాజీ మంత్రి పండిట్ సుఖ్ రామ్ మరణవార్త విన్న పలువురు సీనియర్ రాజకీయ నాయకులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. సుఖ్ రామ్ మరణవార్త చాలా బాధాకరమని.. సుఖ్ రామ్ ఆత్మకు శాంతి చేకూరాలని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. 


Also Read: Supreme on Sedition law: రాజద్రోహం చట్టంపై సుప్రీం విచారణ..కేంద్రానికి సూటి ప్రశ్న


Also Read: Centre Warns Cab Aggrigators: ఓలా, ఉబెర్‌లకు కేంద్రం భారీ షాక్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.