Supreme on Sedition law: రాజద్రోహం చట్టంపై సుప్రీం విచారణ..కేంద్రానికి సూటి ప్రశ్న

Supreme on Sedition law: రాజద్రోహం చట్టానికి ( ఐపీసీ సెక్షన్ 124 ఏ) వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. కేంద్రానికి  24 గంటల గడువిచ్చింది. రాజద్రోహం చట్టం పై పునర్ పరిశీలన వ్యవహారంపై కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 10, 2022, 09:20 PM IST
  • రాజద్రోహం చట్టాన్ని అప్పటివరకు రద్దు చేస్తారా ?
  • కేంద్రం వైఖరి కోరిన సుప్రీం కోర్టు
  • సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం
Supreme on Sedition law: రాజద్రోహం చట్టంపై సుప్రీం విచారణ..కేంద్రానికి సూటి ప్రశ్న

Supreme on Sedition law: రాజద్రోహం చట్టానికి ( ఐపీసీ సెక్షన్ 124 ఏ) వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. కేంద్రానికి  24 గంటల గడువిచ్చింది. బ్రిటిష్ కాలం నాటి ఈ చట్టం దుర్వినియోగం అవుతోందన్న విమర్శలు ఉన్నాయి. తమను విమర్శించే వారిపై ఈ చట్టం కింద కేసులు నమోదు చేస్తూ.. ప్రభుత్వాలు వేధింపులకు పాల్పడుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విపక్ష నేతలు, పాత్రికేయులపైనా ఈ సెక్షన్ కింద కేసులు నమోదు అవుతుండటంతో సర్వత్రా ఆందోళనలు కలిగిస్తోంది. దాంతో రాజద్రోహం చట్టం దుర్వినియోగం అవుతోందంటూ పలువురు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

అయితే రాజద్రోహం చట్టాన్ని పునర్‌ పరిశీలిస్తామంటూ సుప్రీం కోర్టులో కేంద్రం సోమవారం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందుకు కొంత సమయాన్ని కోరింది. దాంతో ఈ ప్రక్రియ పూర్తయ్యే లోగా ప్రస్తుతం ఈ చట్టం కింద నమోదైన కేసులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ సెక్షన్ల కింద కేసులు నమోదైన వారిపై తదుపరి చర్యలను తాత్కాలికంగా నిలిపివేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశిస్తారా అని ప్రశ్నించింది. దీనిపై సమాధానం చెప్పాలని గురువారం వరకు గడువు ఇచ్చింది.

కేంద్ర ప్రభుత్వం తరుపున కేసు విచారణకు హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు ఈ సందర్భంగా సుప్రీం కోర్టు పలు సూచనలు చేసింది. ఐపీసీ 124ఏ చట్టంపై పునర్ పరిశీలన ప్రక్రియ త్వరలో పూర్తి చేయాలని సూచించింది. మూడు, నాలుగు నెలల్లో పూర్తి చేయాలనీ ...అప్పటివరకు ఈ సెక్షన్ కింద కేసుల నమోదైన వారిపై చర్యలు తీసుకోకుండా చూడాలని సలహా ఇచ్చింది.

ఇటీవల మహారాష్ట్రలో స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్‌పై రాజద్రోహం కేసు నమోదైన విషయాన్ని సుప్రీం కోర్టు పరోక్షంగా ప్రస్తావించింది. హనుమాన్ చాలీసా పఠనం లాంటివి కూడా ఇలాంటి కేసుల దారి తీస్తోందని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొందని కోర్టు గుర్తు చేసింది. ఈ చట్టం దుర్వినియోగం అవుతున్నట్లు పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం దాన్ని అడ్డుకునేందుకు ఏ చర్యలు తీసుకుంటుందని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన పాత్రికేయుడు వినోద్ దువాపై నమోదైన రాజద్రోహం కేసును సుప్రీం కోర్టు రద్దు చేసింది.

Also Read: Cyclone Asani Update Today: అసని తుపాను .. ఆంధ్రప్రదేశ్‌కు రెడ్ అలర్ట్

Also Read: Ministers on Narayana : నారాయణ అందుకే అరెస్టయారన్న మంత్రులు, సజ్జల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News