Centre Warns Cab Aggrigators: ఏసీ ఆన్ చేస్తే బాదుడు, పీక్ అవర్స్ పేరుతో మరో బాదుడు.. ఇష్టం వచ్చినట్లు రైడ్స్ క్యాన్సిల్.. అయినా స్పందించేవాళ్లుండరు. కస్టమర్ కేర్ పనిచేయదు.. ఇలా సవాలక్ష సమస్యలు. చెప్పుకోలేని బాధలు. కస్టమర్ల అవసరాలే ఆసరాగా క్యాబ్ సంస్థలు నిలువెల్లా దోచుకుంటున్నాయి. వినియోగదారులను పీల్చిపిప్పి చేస్తున్నాయి. క్యాబ్ సంస్థల దోపిడీపై వస్తున్న వరుసకంప్లైంట్లతో చర్యలు ప్రారంభించింది కేంద్రప్రభుత్వం. వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో క్యాబ్‌సంస్థలతో సమావేశం ఏర్పాటుచేసింది.
కరోనా తర్వాత క్యాబ్‌సంస్థల దోపిడీ విపరీతంగా పెరిగిపోయింది. ఇటు వినియోగదారులతో పాటు అటు క్యాబ్ డ్రైవర్లను కూడా క్యాబ్ సంస్థలు దోచుకుంటున్నాయి. పీక్‌అవర్స్, వెయిటింగ్, ఏసీ ఛార్జ్ ఇలా రకరకాల పేర్లతో ఇష్టంవచ్చినట్లు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ప్రయాణీకుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నా క్యాబ్ డ్రైవర్లకు మాత్రం చిల్లరనే విదిలిస్తున్నాయి క్యాబ్‌సంస్థలు. దీంతో ఈ సంస్థల వైఖరిపై ఇటు వినియోగదారులు అటు క్యాబ్ డ్రైవర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరో వైపు క్యాబ్ సంస్థలను ఏమీ చేయలేక .. డ్రైవర్లు కూడా తమ కోపాన్ని ప్రయాణీకులపై చూయిస్తున్నారు. తమకు నచ్చకుంటే ఇష్టం వచ్చినట్లు రైడ్స్ క్యాన్సిల్ చేస్తున్నారు. దీంతో క్యాబ్ అగ్రిగేటర్స్, ఇటు డ్రైవర్ల మద్య కస్టమర్లు నలిగిపోతున్నారు. కనీసం కంప్లైంట్ చేసేందుకు కూడా ఆప్షన్ లేక.. తప్పనిసరి పరిస్థితుల్లో తిడుతూనే క్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఎండలకు ఏసీ ఆన్ చేయాలన్నా అదనపు ఛార్జీ వసూలు చేస్తుండటంపై తీవ్రంగా మండిపడుతున్నారు.
క్యాబ్ సంస్థలపై విపరీతంగా వస్తున్న కంప్లైంట్స్ తో కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఓలా , ఉబెర్‌లతో పాటు ఇతర క్యాబ్ సంస్థలైన మేరూ, జుగ్నూ ప్రతినిధులతో వినియోగదారుల మంత్రిత్వ శాఖ అధికారులు సమావేశమయ్యారు. క్యాబ్ సంస్థల కార్యకలాపాలపై ఆరా తీశారు. వెంటనే పేమెంట్స్, ప్రైసింగ్ వంటి వివరాలను అందించాలని ఆదేశించారు. వినియోగదారులకు సరైన సేవలు అందించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కస్టమర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై వెంటనే దృష్టికేంద్రీకరించాలని వార్నింగ్ ఇచ్చారు.
క్యాబ్‌సంస్థల పనితీరుపై గత నెలలో ఓ సంస్థ చేసిన సర్వేలో విస్తుగొలిపే వాస్తవాలు బయటపడ్డాయి. క్యాబ్ సంస్థలు కేంద్రం మార్గదర్శకాలను యథేచ్చగా ఉల్లంఘిస్తున్నాయని స్పష్టమైంది. ఇష్టం వచ్చినట్లు డ్రైవర్లు రైడ్స్ క్యాన్సల్ చేస్తున్నారని, అధికఛార్జీలు వసూలు చేస్తున్నారని 71 శాతం మంది వినియోగదారులు కంప్లైంట్ చేశారు. భద్రతా ప్రమాణాలను కూడా పాటించడం లేదని తెలిపారు. మరి కేంద్రం ఇచ్చిన వార్నింగ్ పనిచేసైనా క్యాబ్‌సంస్థలు దారికి వస్తాయో లేదో చూడాల్సి ఉంది.
also read: Fire Accident: ఏడుగురు సజీవ దహనమైన ఘటనలో షాకింగ్ విషయాలు... వెలుగులోకి 'ప్రేమ' కోణం...
also read: Driving License Rules: డ్రైవింగ్ లైసెన్స్ కొత్త నియమాలు, ఇక లైసెన్స్ మరింత సులభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.