PM Kisan Samman Nidhi: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతి కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రతీ ఏటా రూ.6వేలు ఆర్థిక సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే. మూడు విడతల్లో రూ.2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో పదో విడత కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల ఖాతాల్లో రూ.2 వేలు చొప్పున డబ్బులు జమ చేశారు. ఇందుకోసం మొత్తం రూ.20 వేల కోట్లు విడుదల చేయగా.. తద్వారా 9.5 లక్షల పైచిలుకు రైతులకు లబ్ది చేకూరింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీరు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులైనప్పటికీ.. మీకు ఆ నిధులు అందకపోతే పీఎం కిసాన్ వెబ్‌సైట్ ద్వారా మీ ఫిర్యాదును నమోదు చేయవచ్చు. ఆ ఫిర్యాదును ఎలా నమోదు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..


పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇన్‌స్టాల్‌మెంట్ అందకపోతే ఇలా చేయండి :


1) మొదట https://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అందులో హెల్ప్ డెస్క్ ఆప్షన్‌ని ఎంచుకుని ఫిర్యాదును నమోదు చేయాలి.


2) సోమవారం-శుక్రవారం మధ్యలో మీ ఫిర్యాదును నమోదు చేయవచ్చు.


3) pmkisan-ict@gov.in. లేదా pmkisan-funds@gov.in మెయిల్స్‌కు మీ ఫిర్యాదులను పంపించవచ్చు.


4) పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నంబర్ 011-24300606/155261కి కాల్ చేసి కూడా మీ ఫిర్యాదును నమోదు చేయవచ్చు.


5) ఫిర్యాదుల నమోదుకు పీఎం కిసాన్ టోల్ ఫ్రీ నంబర్ 1800-115-526కు కాల్ చేయొచ్చు.


6) పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ https://pmkisan.gov.in/Grievance.aspxలోనూ ఫిర్యాదును చేయొచ్చు. అందులో మీ ఆధార్ కార్డు నంబర్, అకౌంట్ నంబర్, మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి 'గెట్ డిటెయిల్స్'పై క్లిక్ చేయండి. స్క్రీన్‌పై పూర్తి వివరాలు డిస్‌ప్లే అవుతాయి.


7) పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా అందే నిధులు నేరుగా రైతుల ఖాతాల్లోనే జమవుతాయి. 


Also Read: Srivalli Comedy Video: నాటకం మధ్యలో శ్రీవల్లి పాట.. నాటకం ఆపేసి స్టెప్పేసిన ఆర్టిస్ట్.. నవ్వులే నవ్వులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook