Srivalli Comedy Video: నాటకం మధ్యలో శ్రీవల్లి పాట.. నాటకం ఆపేసి స్టెప్పేసిన ఆర్టిస్ట్.. నవ్వులే నవ్వులు

Srivalli Comedy Video: అల్లు అర్జున్ పుష్ప విడుదలై రెండు నెలలు గడిచిపోయినా ఇప్పటికీ ఆ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. ఇప్పటికీ ఎక్కడ విన్నా పుష్ప పాటలు, మాటలే వినిపిస్తున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 2, 2022, 08:11 PM IST
  • ఇంకా తగ్గని అల్లు అర్జున్ పుష్ప మేనియా
  • వైరల్‌గా మారిన యక్షగాన కళాకారుడి వీడియో
  • శ్రీవల్లి పాటకు స్టెప్పులేసిన యక్షగాన కళాకారుడు
 Srivalli Comedy Video: నాటకం మధ్యలో శ్రీవల్లి పాట.. నాటకం ఆపేసి స్టెప్పేసిన ఆర్టిస్ట్.. నవ్వులే నవ్వులు

Srivalli Comedy Video: అల్లు అర్జున్ పుష్ప మేనియా ఇప్పటికీ జనాలను వీడట్లేదు. పుష్ప పాటలు, డైలాగ్స్, స్టెప్పులు, మేనరిజమ్స్ ఇప్పటికీ జనాలను షేక్ చేస్తూనే ఉన్నాయి. పుష్ప పాట వినబడిందంటే చాలు.. చాలామంది కాలు కదపకుండా ఉండలేకపోతున్నారు. తాజాగా ఓ యక్షగాన కళాకారుడు పుష్ప పాటకు అల్లు అర్జున్ హుక్ స్టెప్ వేసిన తీరు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకోవడమే కాదు నవ్వులు పూయిస్తోంది.

కర్ణాటకకు చెందిన ఓ యక్షగాన కళాకారుల బృందం ఇటీవల ఓ చోట నాటకం ప్రదర్శించింది. స్టేజీపై నాటకం ప్రదర్శిస్తున్న సమయంలో ఒక్కసారిగా శ్రీవల్లి పాట వినిపించింది. అంతే.. స్టేజీపై ఉన్న కళాకారుల్లో ఒకరు.. అల్లు అర్జున్ హుక్ స్టెప్పును దింపేశారు. దీంతో స్టేజీపై ఉన్న కళాకారులతో సహా ప్రేక్షకులు ఒక్కసారిగా నవ్వేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అల్లు అర్జున్-రష్మిక మందన్నా కాంబినేషన్‌లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప ది రైజ్' సినిమా గతేడాది డిసెంబర్ 21న విడుదలైన సంగతి తెలిసిందే. సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా సినిమాలోని పాటలు, మాటలు, మేనరిజమ్స్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యాయి. సెలబ్రిటీలు సైతం పుష్ప పాటలు, డైలాగ్స్, మేనరిజమ్స్‌ను ప్రదర్శిస్తూ వీడియోలు చేశారు.. ఇంకా చేస్తూనే ఉన్నారు. త్వరలోనే పుష్ప 2 షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఈ ఏడాది డిసెంబర్‌లో పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రావొచ్చునని చెబుతున్నారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News