West Bengal Elections: పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై ఎవరి అంచనాలు వారికున్నాయి. అధికార పార్టీ టీఎంసీ , ప్రతిపక్షం బీజేపీ హోరాహోరీ పోరు సాగుతోంది. పక్కాగా 2 వందల సీట్లు గెలుస్తామని..సీజనల్ భక్తులు కాదని ప్రధాని నరేంద్ర మోదీ...దీదీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసి సంచలనం రేపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో(West Bengal Elections) స్టార్ క్యాంపెయినర్ల జోరు కొనసాగుతోంది. బెంగాల్ పీఠంపై కాషాయజెండా ఎగురవేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ (Bjp) ప్రచార ఉధృతి పెంచింది. బీజేపీ తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra modi) ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జయనగర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడమే కాకుండా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 


ప్రధాని మోదీ ఏమన్నారంటే..


మేం పక్కా 200 సీట్లు గెలుస్తాం.. ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా గెలుస్తాం.. మీలాగా సీజనల్‌ భక్తులం కాదు. కూల్‌ కూల్‌.. 200 అసెంబ్లీ స్థానాలు బీజేపీ గెలవబోతోంది. మొదటి దశ పోలింగ్‌తో అధికంగా గెలుస్తామని తెలుస్తోంది. ప్రజల గళానికి దేవుడి ఆశీర్వాదం ఉంది. నేను ఆలయాలకు వెళ్లడం గర్వంగా భావిస్తా.. మీలాగా పూటకోలాగ ఉండను. నేను ఆలయాల్ని సందర్శించడం తప్పా అని ప్రజల్ని ప్రశ్నించారు మోదీ. మమతా బెనర్జీ ( Mamata Banerjee) కు కాషాయ వస్త్రాలు, దుర్గా మాత నినాదాలు, జై శ్రీరామ్ నినాదాలు ఆక్రోశం తెప్పిస్తున్నాయని చెప్పారు. బెంగాల్‌లో బీజేపీ హవా, కమలం హవా కొనసాగుతుందని స్పష్టం చేశారు. రెండో దశ పోలింగ్ కు వస్తున్న ఓటర్లను చూస్తుంటేనే తెలుస్తోందన్నారు. 


Also read: LPG cylinder price: వరుసగా రూ. 125 పెరిగిన తర్వాత తొలిసారి తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధరలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook