International Yoga day | న్యూ ఢిల్లీ: భారత దేశ వారసత్వ సంపదగా ఉన్న యోగాను( Yoga ) అంతర్జాతీయంగా ప్రాచుర్యంలో తెచ్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుంది. ప్రతి యేటా జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడంలో ప్రదాని మోదీ కీలకపాత్ర పోషించారనేది అందరికీ తెలిసిందే. ప్రస్తుత కరోనావైరస్ (CORONAVIRUS) సంక్షోభంలో యోగా ప్రాముఖ్యతను ప్రపంచదేశాలు గుర్తించాయని ప్రధాని మోదీ తెలిపారు. యోగాతో (  YOGA ) కరోనాను ఎదుర్కోవచ్చని.. అది మన జీవనయానంలో ఓ భాగం కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. కరోనా సంక్షోభం కారణంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (  International yoga day ) ఇళ్లలో ఉండి జరుపుకోవల్సివస్తోందని ఆయన అన్నారు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇవాళ ప్రధాని మోదీ ఆన్‌లైన్ ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ( International Yoga Day 2020: నేడే యోగా డే )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనావైరస్ (CORONAVIRUS) వ్యాప్తి నేపధ్యంలో శరీరంలోని రోగ నిరోధక శక్తిని ( Immunity power) పెంచడానికి యోగాలో అనేక ఆసనాలున్నాయని... ముఖ్యంగా ప్రాణాయామాన్ని(  Pranayama Asanam )  జీవితంలో ఓ భాగంగా చేసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. కరోనా ముఖ్య లక్షణంగా ఉన్న శ్వాస వ్యవస్థలో తలెత్తే ఇబ్బందుల్ని ( Respiratory issues) ప్రాణాయామ ఆసనం ద్వారా అధిగమించవచ్చని ఆయన చెప్పారు. యోగాతో శారీరకంగా, మానసికంగా ధృడత్వం పెరుగుతుందన్నారు. యోగాతో శాంతి, సహనశక్తి పెరుగుతాయని... ముఖ్యంగా కుటుంబ సభ్యులతో బంధమనేది బలోపేతమవుతుందన్నారు. కష్టాల్ని ఎదుర్కోడానికి... వాటిని అధిగమించడానికి యోగా ఉపయోగపడుతుందన్నారు. నిత్యం కష్టాల్లో కూడా క్రియాశీలకంగా ఉండేవ్యక్తే ఆదర్శ వ్యక్తి అవుతారని స్వామి వివేకానంద ( Swami Vivekananda ) చెప్పిన మాటల్ని ఈ సందర్బంగా మోదీ ఉదహరించారు. Surya Grahanam 2020: వలయాకార సూర్యగ్రహణం.. నేడు ఖగోళంలో అద్భుతం )


యోగా  సాధకుడు ఎన్నడూ జీవితంలో నిరాశకు గురి కాడనేది మనం గమనించాలని మోదీ అన్నారు. ఆరోగ్యవంతమైన లోకం కోసం యోగా పాత్ర కీలకమన్నారు. మానసిక సమతుల్యతను, భావోద్వేగాల్ని నియంత్రించుకోవడంలో యోగా అద్భుతమైన మార్గమన్నారు. సమస్యల పరిష్కారం గురించి మాట్లాడినప్పుడు గానీ.. కరోనా సంక్షోభం గురించి ప్రస్తావించినప్పుడు గానీ యోగానే గుర్తుకు వస్తుందన్నారు. చేసే పనిలో సమర్ధతను యోగానే నేర్పుతుందన్నారు. జీవితంలో ప్రతిరోజూ చేసే పనిని సక్రమంగా చేయడం కూడా యోగాలో భాగమేనని మోదీ చెప్పారు. యోగాకు జాతి, మతం, రంగు, కులం అనే వివక్షత లేదన్నారు. Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు )


ఈ విశిష్టతల కారణంగానే ఇవాళ మొత్తం ప్రపంచం కరోనాతో అల్లాడుతున్న సమయంలోనూ యోగా ప్రాముఖ్యతను గతం కంటే ఎక్కువగా ప్రపంచం గుర్తిస్తోందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..