ఓవైపు కరోనా వైరస్ లాంటి మహమ్మారి వేలాది ప్రాణాలను బలితీసుకుంటున్నా కొందరికి బుద్ధి రావడం లేదు. మూగ జీవాలు, జంతువులను ఆదుకోవాల్సింది పోయి వాటి ప్రాణాలు తీస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఆకతాయి చేసిన చర్య ఫలితంగా విషాదం చోటుచేసుకుంది. గర్భంతో ఉన్న ఓ ఏనుగు (Pregnant Elephant Dies) ప్రాణాలు కోల్పోయింది. కేరళలోని మలప్పురం జిల్లాలో మే 27న జరిగిన ఈ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. క్వారంటైన్ కేంద్రాల్లో 2 ప్యాకెట్ల కండోమ్స్ పంపిణీ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫారెస్ట్ ఆఫీసర్ మోహన్ క్రిష్ణన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వైరల్ అయింది. ఆకలిగా ఉన్న ఏనుగు సమీపంలోని ఓ గ్రామంలో ప్రవేశించింది. వీదుల్లో తిరుగుతూంటే దానికి పైన్ ఆపిల్ చూపించి ఆశపెట్టారు. ఆహారం దొరికిందని తొండంతో నోట్లో వేసుకోగానే భారీ శబ్ధంతో అది పేలిపోయింది. ఏనుగుకు భారీగా రక్తస్రావం కాగా, కీటకాల బారి నుంచి రక్షించుకునేందుకు సమీపంలోని వెల్లియార్ నది వద్దకు వెళ్లి తొండాన్ని నీళ్లలో ఉంచినట్లు అధికారి తన ఫేస్ బుక్ పోస్టులో తెలిపారు.   గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్


విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది ఏనుగును రక్షించాలని కొన్ని గంటలపాటు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, మే 27న సాయంత్రం 4 గంటలకు ఏనుగు చనిపోయిందని పేర్కొన్నారు. అది ఎవరికీ ఏ హాని చేయలేదని, ఏ ఇంటిపై దాడి చేయలేదని.. అలాంటి మంచి జంతువును చంపేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గర్భంతో ఉన్న ఏనుగు (Pregnant Elephant) కడుపులో ఉన్న మరో ప్రాణి గురించి ఆలోచించి నరకం అనుభవించిందని తన పోస్టులో జరిగిన దారుణాన్ని వివరించారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి