క్వారంటైన్ కేంద్రాల్లో 2 ప్యాకెట్ల Condoms పంపిణీ

క్వారంటైన్ కేంద్రాల్లో 2 ప్యాకెట్ల కండోమ్స్ పంచుతూ అధికారులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కోవిడ్19కు దీనికి ఏ సంబంధం లేదని, మంచి ఉద్దేశంతో ఇలా చేస్తున్నట్లు వైద్యశాఖ అధికారి తెలిపారు.

Updated: Jun 3, 2020, 10:43 AM IST
క్వారంటైన్ కేంద్రాల్లో 2 ప్యాకెట్ల Condoms పంపిణీ

కేంద్ర ప్రభుత్వం అంతర్ రాష్ట్ర ప్రయాణాలకు అనుమతి ఇచ్చాక వలస కూలీలు సహా చాలా మంది తమ స్వస్థలాలకు తిరిగొస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర సరిహద్దులో వారికి టెస్టులు నిర్వహించి క్వారంటైన్ కేంద్రాలకు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో బిహార్ అధికారులు క్వారంటైన్ కేంద్రాల్లో కండోమ్స్ (Condoms), గర్భనిరోధక మాత్రలు పంచుతూ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  తగ్గిన బంగారం ధరలు.. వెండి పైపైకి

క్వారంటైన్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్న వారికి కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు, ఇతరత్రా ప్రెగ్నెన్సీ కిట్లను పంచుతున్నారు. కుటుంబ నియంత్రణ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రత్యేకమైన ప్రయోగం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి సమయంలోనే జనాభాను నియంత్రించాలంటే కొన్ని చర్యలు తీసుకోవాలని బిహార్ ప్రభుత్వం భావించింది. ఇతర రాష్ట్రాల నుంచి ఇప్పటివరకు మొత్తం 14,03,576 మంది తిరిగొచ్చి క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారు. ఇందులో 8,76,808 మంది క్వారంటైన్ వ్యవధిని పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. వీరికి క్వారంటైన్ కేంద్రాల్లో కండోమ్‌లు, గర్భ నిరోధక ఇతరత్రా కిట్లు అందజేశారు.   గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్

క్వారంటైన్ నుంచి ఇంటికి వెళ్తున్న వారికి 2 ప్యాకెట్ల కండోమ్స్ అందించడంతో పాటు జనాభా  నియంత్రణ గురించి వారికి సలహా ఇస్తున్నామని ఆరోగ్య శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. కోవిడ్19తో దీనికి ఏ సంబంధం లేదు. ప్రస్తుత సమస్యలతో జనాభా పెరుగుదల మరో ఇబ్బందిగా మారకూడదని ప్రత్యక్ష కుటుంబ నియంత్రణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి