RRB Group D Updates: ఆర్‌ఆర్‌బీ గ్రూప్ డీ పరీక్షకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ లింకు అందుబాటులోకి వచ్చింది. గురువారమే (ఆగస్టు 18) ఈ లింకు యాక్టివేట్ చేయబడింది. గ్రూప్ డీ అభ్యర్థులు ఈ లింకు ద్వారా తమ ఎలిజిబిలిటీ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు. పుట్టిన తేదీ,రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా అభ్యర్థులు ఎలిజిబిలిటీ స్టేటస్‌ను చెక్ చేసుకునే అవకాశం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అప్లికేషన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి :


అభ్యర్థులు సంబంధిత రీజినల్ ఆర్‌ఆర్‌బీ సైట్‌ను ఓపెన్ చేయాలి.
హోం పేజీలో CEN No.RRC-01/2019 లెవల్-1 లింక్‌పై క్లిక్ చేయాలి.
స్క్రీన్‌పై కనిపించే బాక్స్‌లో రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి సబ్‌మిట్ ఆప్షన్ నొక్కాలి.
అంతే.. స్క్రీన్‌పై ఫలితాలు కనిపిస్తాయి.
ఆ కాపీని ప్రింటవుట్ తీసి ఉంచుకోవాలి.


ఆర్‌ఆర్‌బీ గ్రూప్ 'డీ' ఫేజ్-1 పరీక్ష ఆగస్టు 17న ప్రారంభమైంది. ఆగస్టు 25 వరకు మల్టీపుల్ షిఫ్ట్స్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. ఫేజ్-2 పరీక్ష ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరగనుంది. రైల్వే శాఖలో 1,03,769 గ్రూప్ డీ పోస్టుల భర్తీకి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈసారి దాదాపుగా 1.15 కోట్ల మంది అభ్యర్థులు గ్రూప్ డీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.


Also Read: TRS Warning: బండి సంజయ్ నాలుక చీరేస్తా.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సంచలనం


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్.. ఒకేసారి 3 బెనిఫిట్స్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook