TRS Warning: బండి సంజయ్ నాలుక చీరేస్తా.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సంచలనం

TRS Warning: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార టీఆర్ఎస్ కు ధీటుగా కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా  అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు.

Written by - Srisailam | Last Updated : Aug 19, 2022, 01:05 PM IST
  • తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్
  • కేసీఆర్ పై సంజయ్ హాట్ కామెంట్స్
  • బండి సంజయ్ నాలుక చీరేస్తా- ఎమ్మెల్సీ రాజు
TRS Warning: బండి సంజయ్ నాలుక చీరేస్తా.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సంచలనం

TRS Warning: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార టీఆర్ఎస్ కు ధీటుగా కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా  అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. హద్దులు దాటి సవాళ్లు విసురుకుంటున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్... ఎక్కడ మాట్లాడినా సీఎం కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. జనగాం పర్యటనలో కేసీఆర్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు బండి సంజయ్.

సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ చేసిన కామెంట్లకు కారు పార్టీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. సంజయ్ పై తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు. సీఎం కేసీఆర్‌పై అనుచితింగా మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.  టీఆర్ఎస్ కార్యకర్తలు తలచుకుంటే బండి అడుగు ముందుకు వేయలేరన్నారు. బండి సంజయ్ చేయాల్సింది పాదయాత్ర కాదు.. తెలంగాణకు నిధుల కోసం కేంద్రంపై దండయాత్ర చేయాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. అభివృద్ధి గురించి మాట్లాడకుండా మతాల మధ్య చిచ్చు పెట్టేలా బండి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే సంక్షేమంపై మాట్లాడాలని సంజయ్ కి ఆయన సవాల్ చేశారు.  

Read also: Munugode Bypoll: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? బహిరంగ సభలో కేసీఆర్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారా?

Read also: Big Debate With Bharath : కోమటిరెడ్డిపైకి అద్దంకిని ఉసిగొల్పింది రేవంత్ రెడ్డేనా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News