RRB Group D Exams: ఆర్ఆర్‌బీ గ్రూప్ డీ పరీక్షా తేదీలు ఖరారు... షెడ్యూల్, గైడ్‌లైన్స్ ఇవే...

RRB Group D Exams Schedule: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు గ్రూప్ డీ పోస్టుల పరీక్షా తేదీలను ఖరారు చేసింది. ఈ మేరకు గురువారం (ఆగస్టు 5) పరీక్షా తేదీలను ప్రకటించింది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 8, 2022, 05:32 PM IST
  • ఆర్‌ఆర్‌బీ గ్రూప్ డీ ఎగ్జామ్స్ షెడ్యూల్ ఖరారు
  • ఆగస్టు 17 నుంచి ఆగస్టు 25 వరకు పరీక్షలు
  • కంప్యూటర్ బేస్డ్ టెస్ట్.. ఆన్‌లైన్ ద్వారా పరీక్షలు
RRB Group D Exams: ఆర్ఆర్‌బీ గ్రూప్ డీ పరీక్షా తేదీలు ఖరారు... షెడ్యూల్, గైడ్‌లైన్స్ ఇవే...

RRB Group D Exams Schedule: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) గ్రూప్-డీ పోస్టులకు ఫేజ్-1 పరీక్షా తేదీలను ప్రకటించింది. ఆగస్టు 17 నుంచి ఆగస్టు 25 వరకు గ్రూప్ డీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా ఆయా నగరాల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో మల్టిపుల్ షిఫ్ట్స్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులు ఆగస్టు 9 నుంచి హాల్ టికెట్లను ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలి.

హాల్ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి :

  • ఆర్ఆర్‌బీ రీజియన్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. 
  • హోం పేజీలో అడ్మిట్ కార్డు లేదా హాల్ టికెట్‌పై క్లిక్ చేయండి
  • రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి సబ్‌మిట్ ఆప్షన్ నొక్కండి
  • అంతే స్క్రీన్‌పై మీ హాల్ టికెట్ డిస్‌ప్లే అవుతుంది. హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసి ఉంచుకోండి.

రైల్వే శాఖలో మొత్తం 1,03,769 గ్రూప్ డీ పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. దాదాపుగా 1 కోటి పైచిలుకు మంది అభ్యర్థులు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. లేనిపక్షంలో పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. అభ్యర్థులు తప్పనిసరిగా ఆధార్ కార్డును కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఫేజ్1 పరీక్షా తేదీలను మాత్రమే ప్రకటించిన ఆర్‌ఆర్‌బీ... మిగతా ఫేజ్‌లకు సంబంధించిన పరీక్షా తేదీలను త్వరలోనే ప్రకటించనుంది. ఆర్ఆర్‌బీ అప్‌డేట్స్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ప్రకటిస్తారని అభ్యర్థులు గమనించాలి. ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆర్ఆర్‌బీ నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారానే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

Also Read: రేపే ఎస్సై ప్రిలిమ్స్‌ ఎగ్జామ్.. అభ్యర్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!

Also Read: Uma Maheshwari Death: ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి మృతిపై పోస్టుమార్టమ్ రిపోర్ట్.. ఏం తేలిందంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

 

Trending News