Sasikala to Chennai: నేడు చెన్నైకు శశికళ..అడ్డుకునేందుకు నిఘా వలయం
Sasikala to Chennai: తమిళనాడులో నేడు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. జైలుశిక్ష అనంతరం తొలిసారి చెన్నైకు రానున్నారు చిన్నమ్మ. ఆమె ప్రవేశించకుండా రెండు ప్రాంతాల్లో నిఘా వలయం ఏర్పాటైంది. ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది.
Sasikala to Chennai: తమిళనాడులో నేడు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. జైలుశిక్ష అనంతరం తొలిసారి చెన్నైకు రానున్నారు చిన్నమ్మ. ఆమె ప్రవేశించకుండా రెండు ప్రాంతాల్లో నిఘా వలయం ఏర్పాటైంది. ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది.
తమిళనాడు ( Tamilnadu ) రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అవినీతి, అక్రమాస్థుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష అనంతరం విడుదలైన శశికళ ( Sasikala ) తొలిసారి చెన్నైకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. టీనగర్‌లోని హబీబుల్లా రోడ్‌లో ఆమె బసకు ఓ భవనం సిద్ధమైంది. తమిళనాడు సరిహద్దులోని హోసూరు నుంచి చెన్నై వరకూ రోడ్డు మార్గంలో ఏడు జిల్లాల మీదుగా శశికళ పయనం సాగనుంది. మొత్తం 66 చోట్ల ఆహ్వాన ఏర్పాట్లు జరిగాయి. అన్నాడీఎంకే ( AIADMK ) జెండా ఉన్న కారులోనే ఆమె వస్తున్నట్టు తెలుస్తోంది.
ఓ వైపు ఘన స్వాగతానికి ఏర్పాట్లు జరుగుతుంటే మరోవైపు అడ్డుకునే ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. ముఖ్యంగా అన్నాడీఎంకే కార్యాలయం ( AIADMK Office ), మెరీనా తీరంలోని జయలలిత సమాధి పరిసరాల్లో శశికళ రాకుండా అడ్డుకునేందుకు నిఘా వలయాన్ని( Tight Security ) ఏర్పాటు చేశారు. నిఘా వలయాన్ని ఛేదించుకుని శశికళ ఆ రెండు ప్రాంతాల్ని సందర్శించనున్నారా లేదా అనేది ఆసక్తి కల్గిస్తోంది. మరోవైపు ఆమెకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కళగం ప్రధాన కార్యదర్శి దినకరన్ కమీషనరేట్‌కు విజ్ఞప్తి చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook