Employees Fired From Twitter India: ట్విటర్ ఇండియా ఆపరేషన్స్‌కు సంబంధించి ట్విటర్ సంస్థలో కమ్యునికేషన్స్, మార్కెటింగ్, పాలసీ తయారీ వంటి విభాగాల్లో భారీగా ఉద్యోగులను తొలగిస్తూ ఎలాన్ మస్క్  నిర్ణయం తీసుకున్నాడు. అయితే, ఎలాన్ మస్క్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించడమే కాకుండా కార్పొరేట్ వర్గాల్లో హాట్ టాపిక్ అయి కూర్చుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విశ్వవ్యాప్తమైన ట్విటర్ సంస్థను రీస్ట్రక్చర్ చేసే ఆలోచనలో భాగంగానే ఇలా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పలు విభాగాల్లో పనిచేస్తోన్న సిబ్బందిని తొలగించక తప్పదని ఎలాన్ మస్క్ నిర్ణయంచుకున్నట్టు తెలుస్తోంది. భారత్‌లో ట్విటర్ సంస్థ కోసం దాదాపు 200 మంది వరకు ఇంజనీరింగ్ సిబ్బంది పనిచేస్తుండగా.. అందులోంచి 50 శాతానికి పైగా సిబ్బందిని తొలగించినట్టు వార్తలొస్తున్నాయి. అయితే, ఈ విషయాన్ని ట్విటర్ సంస్థ ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.


ఇండియాలో భారీ సంఖ్యలో ఉద్యోగులను పక్కనపెట్టిన ఎలాన్ మస్క్.. మరో సంచలన నిర్ణయం కూడా తీసుకున్నాడు. ట్విటర్ సంస్థకు సంబంధించిన విలువైన సమాచారం గోప్యత కోసం కొంతమంది సిబ్బందికి మేనేజ్మెంట్ యాక్సెస్ తొలగించారు. అయితే, యాక్సెస్ తొలగించినంత మాత్రాన్నే మిమ్మల్ని ఉద్యోగంలోంచి తొలగించడం కాదు అని ఎలాన్ మస్క్ ఉద్యోగులకు రాసిన ఓ లేఖలో స్పష్టంచేశాడు. 


ఉద్యోగంలోంచి తీసేసిన సిబ్బందికి స్లాక్ ద్వారా సందేశం ఇచ్చిన ట్విటర్ సీఇఓ ఎలాన్ మస్క్.. పని విషయంలో మీకు ఇదే చివరి వర్కింగ్ డే అని స్పష్టంచేశాడు. పని విషయంలో ఇదే చివరి వర్కింగ్ డే అయినప్పటికీ.. 2023 జనవరి 4వ తేదీ వరకు కంపెనీ నుంచి మీకు అందాల్సిన వేతనంతో పాటు ఇతర బెనిఫిట్స్ అందుతుంటాయని స్లాక్ సందేశంలో పేర్కొన్నాడు. అంటే మరో రెండు నెలల పాటు వారికి నాన్-వర్కింగ్ నోటీస్ పీరియడ్ ఇచ్చినట్టు ఎలాన్ మస్క్ చెప్పకనే చెప్పేశాడన్న మాట.


ఈలోగా సిబ్బంది తొలగింపునకు సంబంధించిన అధికారిక ఫార్మాల్టీస్ పూర్తి చేసి వారికి కంపెనీ నుంచి రావాల్సి ఉన్న ఇతర క్లెయిమ్స్ ని విడుదల చేయనున్నట్టు ఎలాన్ మస్క్ ( Elon Musk ) క్లారిటీ ఇచ్చాడు. అదే సమయంలో కంపెనీకి సంబంధించిన కంప్యూటర్, బ్యాడ్జ్ వంటి ఇతర మెటీరియల్స్ అప్పగించాల్సిందిగా తొలగించిన సిబ్బందికి ఎలాన్ మస్క్ స్పష్టంచేశాడు.


Also Read : Fusion Microfinance: తొలిరోజు 12 శాతం సబ్‌స్క్రిప్షన్ నమోదు చేసిన ఇష్యూ, నవంబర్ 15న లిస్టింగ్


Also Read : Five star Business: నవంబర్ 9న 1960 కోట్ల ఐపీవో, మార్కెట్‌లో పెరుగుతున్న అంచనాలు


Also Read : 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్, పెరగనున్న ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook