Twitter Crime: ట్విట్టర్ అధికారం చేతులు మారడంతో కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. బ్లూ టిక్ కోసం ఇక నుంచి ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. బ్లూ టిక్ కావాలంటే నెలకు 8 డాలర్లు చెల్లించాలలి. అయితే ఈ రేటు దేశాన్ని బట్టి మారుతుంది. ప్రముఖల ఖాతాలో వారి పేరు కింద సెకండరీ ట్యాగ్ డిస్ ప్లే కానుంది. మరోవైపు ఆన్‌లైన్ నేరాలపై ట్విట్టర్ కఠిన చర్యలు తీసుకోనుంది. ట్విట్టర్ ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉండండి.. ఇక నుంచి ట్విట్టర్ నిబంధనలు గతంలో కంటే చాలా కఠినంగా ఉండబోతున్నాయి.
మీరు ట్విట్టర్‌లో ఒక వ్యక్తి పోస్ట్‌పై కామెంట్స్‌లో అసభ్యకరమైన భాష ఉండకూడదు. అభ్యంతరకర పదాలను ఉపయోగించకూడదు. ఇష్టానుసారం మాట్లాడితే మీపై కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుంది. మర్యాదపూర్వకమైన భాషలో ట్వీట్లకు రిప్లై ఇవ్వాలి.
అదేవిధంగా అభ్యంతరకరమైన ఫొటోలను షేర్ ట్విట్టర్లో షేర్ చేయకూడదు. వారిని రీట్వీట్ కూడా చేయకూడదు. ఇలా చేస్తే మీరు న్యాయపరమైన చిక్కుల్లో పడతారు.
మీరు ట్విట్టర్‌లో వీడియో పైరసీ చేస్తున్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటారు. అంతేకాకుండా మీ అకౌంట్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేయవచ్చు. మన దేశంలో వీడియో పైరసీ పూర్తిగా చట్టవిరుద్ధం. మీరు అలా చేస్తే కచ్చితంగా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ తప్పుకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా ఉంటుంది.
మీ అకౌంట్ ద్వారా అనైతిక కార్యకలాపాలకు పాల్పడితే.. మీ ఖాతాను ట్విట్టర్ మూసివేస్తుంది. అదేవిధంగా మీపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవచ్చు. బాధ్యతాయుతంగా ట్విట్టర్‌లో పోస్ట్ చేయాలని గుర్తుపెట్టుకోండి. మీపై ఎవరైనా అసభ్యంగా మాట్లాడినా.. అభ్యంతకర కామెంట్స్ చేసినా వెంటనే కంప్లైంట్ చేయండి.
Also Read: Tika Dutta Pokharel: ఎన్నికల బరిలో వందేళ్ల వృద్ధుడు.. మాజీ ప్రధానిపై పోటీకి సై
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook