షేర్ మార్కెట్లో నవంబర్ 2వ తేదీన కొత్తగా ప్రవేశించిన ఈ కంపెనీ ఐపీవో ఫ్యూజన్ మైక్రోఫైనాన్స్. తొలి రోజు 12 శాతం సబ్‌స్క్రిప్షన్ నమోదు చేసిన ఈ షేర్ నవంబర్ 4వ తేదీన క్లోజ్ కానుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
నవంబర్ 2వ తేదీ బుధవారం సబ్‌స్క్రిప్షన్ తొలిరోజు ఫ్యూజన్ మైక్రోఫైనాన్స్ ప్రాధమిక పబ్లిక్ ఆఫరింగ్ 12 శాతం నమోదు చేసింది. మైక్రోల్యాండర్ ఫ్యూజన్ మైక్రోఫైనాన్స్ ఐపీవో సభ్యత్వం కోసం ఓపెన్ అయింది. 350-368 రూపాయల విలువతో ఇష్యూ నవంబర్ 4వ తేదీన క్లోజ్ అవుతుంది.
మార్కెట్ విశ్లేషకుల ప్రకారం ఫ్యూజన్ మైక్రోఫైనాన్స్ షేర్ ఇవాళ గ్రే మార్కెట్‌లో 24 రూపాయల ప్రీమియంలో ఉంది. కంపెనీ షేర్ నవంబర్ 15వ తేదీన స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్టింగ్ కానుంది. ఫ్యూజన్ మైక్రోఫైనాన్స్ ఐపీవో 600 కోట్ల ఈక్విటీ షేర్ జారీ చేసేందుకు, ప్రమోటర్లు, షేర్ హోల్డర్ల ద్వారా 13,695,466 ఈక్విటీ షేర్లను విక్రయించడం ఉద్దేశ్యంగా ఉంది.
ఈ కంపెనీ ప్రైస్ బ్యాండ్‌కు చెందిన అప్పర్ బ్యాండ్ 1104 కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా. ఫ్యూజన్ మైక్రోఫైనాన్స్ ఇండియాలోని గ్రామీణ, రిమోట్ ప్రాంతాల్లో మహిళలకు మైక్రోఫైనాన్స్ అందిస్తోంది.
Also read: Five star Business: నవంబర్ 9న 1960 కోట్ల ఐపీవో, మార్కెట్‌లో పెరుగుతున్న అంచనాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Fusion Microfinance: తొలిరోజు 12 శాతం సబ్‌స్క్రిప్షన్ నమోదు చేసిన ఇష్యూ