7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్, పెరగనున్న ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. డీఏ పెంపు తరువాత ఇప్పుడు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కూడా నిర్ధారణ కానుంది. ఫిట్‌మెంట్ ఎంత ఉండవచ్చనే వివరాలు తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 3, 2022, 06:19 PM IST
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్, పెరగనున్న ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల డీఏ పెరగడమే కాకుండా 18 నెలల ఎరియర్లు కూడా చేతికి అందాయి. ఇప్పుడిక ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కూడా పెరగనుందని తెలుస్తోంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంది, ఎంతవరకూ పెరగవచ్చో తెలుసుకుందాం..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి గుడ్‌న్యూస్ లభిస్తోంది. ఈ నెలలో ప్రభుత్వం ఫిట్ మెంట్ ఫ్యాక్టర్‌పై నిర్ణయం తీసుకోవచ్చు. ఫలితంగా సిబ్బంది కనీస వేతనం పెరగనుంది. ఫిట్‌మెంట్ పెంపుపై డ్రాఫ్ట్ రూపొందించి ప్రభుత్వానికి పంపించవచ్చు. ఉద్యోగుల సంఘాలు దీనిపై అప్‌డేట్ ఇచ్చాయి. ఒకవేళ ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే..52 లక్షల కంటే ఎక్కువ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్ శాలరీలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెరగవచ్చు.

ప్రభుత్వం ఇటీవల ఉద్యోగులకు డీఏ పెంచింది. ఆ తరువాత ఉద్యోగులకు జూలై నుంచి పెరిగిన డీఏ అందించింది. ఇప్పుడు ఒకవేళ ఇందులో ఏదైనా మార్పులుంటే సిబ్బంది కనీస వేతనం పెరుగుతుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌లో మార్పుతో ఉద్యోగుల మొత్తం జీతంపై ప్రభావం కన్పిస్తుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ విషయంలో వచ్చే నెల కీలకమైన భేటీ ఉండనుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంపు కోసం ప్రభుత్వ ఉద్యోగులు సుదీర్ఘకాలంగా నిరీక్షిస్తున్నారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2.57 శాతం చొప్పున ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అందుతోంది. ఇప్పుడు దీనిని 3.68 శాతంకు పెంచవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్ని నిర్ణయించడంలో ఫిట్‌మెంట్ కీలకపాత్ర పోషిస్తుంది. ఫిట్‌మెంట్‌లో మార్పు చేస్తే జీతంపై ప్రభావం కన్పిస్తుంది. దీని ఆధారంగానే ఉద్యోగుల కనీస వేతనం పెరుగుతుంది. 

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 శాతం నుంచి 3.68 చేయడం వల్ల కనీస వేతనం 18 వేల నుంచి 26 వేలకు పెరుగుతుంది. గతంలో అంటే 2017లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు కనీస వేతనం పెంచారు. కానీ ఆ తరువాత ఇందులో ఏ విధమైన మార్పులు చేయలేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనంగా 18 వేలు అందుతున్నాయి. గరిష్టంగా 56,900 రూపాయలు లభిస్తాయి.

ఒకవేళ ప్రభుత్వం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3 రెట్లు పెంచితే..ఉద్యోగుల జీతం 18,000 X 2.57= 46,260 రూపాయలు అందుతాయి. ఒకవేళ ఉద్యోగుల డిమాండ్ అంగీకరిస్తే జీతం 26000X3.68= 95,680 లభిస్తుంది. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ 3 రెట్లు పెరిగితే జీతం 21000X3 = 63,000 రూపాయలౌతుంది.

Also read: Indian Railways: రైల్వేలో ఇప్పుడు సరికొత్త సేవలు, 20 నిమిషాల ముందే ఎలర్ట్ ఎలార్మ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News