Boy Rescued From Borewell: హమ్మయ్య.. బోరు బావిలో పడిన బాలుడు సురక్షితం
Boy Rescued From Borewell: నెల రోజుల క్రితమే మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో తన్మయ్ సాహు అనే బాలుడు 55 అడుగుల లోతైన బోరుబావిలో పడి మరణించిన నేపథ్యంలో ఈ ఘటనలో ఈ బాలుడి పరిస్థితి ఏంటా అనే ఆందోళన అటు తల్లిదండ్రుల్లో, ఇటు అధికారుల్లో నెలకొని ఉంది.
Boy Rescued From Borewell: హాపూర్: ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ప్రమాదవశాత్తుగా 40 అడుగుల లోతైన బోరు బావిలో పడిపోయిన ఆరేళ్ల బాలుడిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా రక్షించాయి. చిన్నారి ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తుగా బోరుబావిలో పడిపోయిన ఈ ఘటన బాలుడి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయచర్యలు ప్రారంభించారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాన్ని రప్పించి బాలుడిని ప్రాణాలతో వెలికి తీసేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారు. ఒకవైపు బోరు బావిని తవ్వుతూనే మరోవైపు బోరుబావిలోకి ఆక్సీజన్‌ని పంపించారు.
నెల రోజుల క్రితమే మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో తన్మయ్ సాహు అనే బాలుడు 55 అడుగుల లోతైన బోరుబావిలో పడి మరణించిన నేపథ్యంలో ఈ ఘటనలో ఈ బాలుడి పరిస్థితి ఏంటా అనే ఆందోళన అటు తల్లిదండ్రుల్లో, ఇటు అధికారుల్లో నెలకొని ఉంది. అయితే, నాలుగు గంటలకు పైగా జరిగిన ఈ ఆపరేషన్ లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కష్టపడి బాలుడిని సురక్షితంగా వెలికి తీశాయి. అనంతరం బాలుడిని వైద్య సహాయం నిమిత్తం అప్పటికే సిద్ధంగా ఉంచిన అంబులెన్సులో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
బాలుడు సురక్షితంగా బయటపడటంతో కుటుంబసభ్యులు, అధికారులు, గ్రామస్తులు హమ్మయ్య అని హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. బోరు బావి లోతు తక్కువ ఉండటం వల్లే నాలుగు గంటల్లో బాలుడిని చేరుకోగలిగామని.. లేదంటే పరిస్థితి ఎలా ఉండేదోనని సహాయ చర్యల్లో పాల్గొన్న సిబ్బంది ఒకరు తెలిపారు.
ఇది కూడా చదవండి : Bengaluru Metro Pillar: కూలిన నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్.. ఇద్దరు మృతి! 6 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్
ఇది కూడా చదవండి : Budget Facts: దేశపు తొలి బడ్జెట్ , అతి పెద్ద బడ్జెట్ ఎప్పుడు, బడ్జెట్ సంబంధించిన ఆసక్తికర అంశాలు
ఇది కూడా చదవండి : Bomb Threat: బాంబులతో పేల్చేస్తామంటూ బెదిరింపు, మాస్కో-గోవా ఎమర్జన్సీ ల్యాండింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook