Bomb Threat: బాంబులతో పేల్చేస్తామంటూ బెదిరింపు, మాస్కో-గోవా ఎమర్జన్సీ ల్యాండింగ్

Bomm Threat: 236 మంది ప్రయాణీకులున్న విమానాన్ని పేల్చేస్తామంటూ బెదిరింపులు. మాస్కో నుంచి గోవా వస్తున్న విమానం అత్యవసరంగా గుజరాత్ జామ్‌నగర్‌లో ల్యాండ్ కావల్సి వచ్చింది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 10, 2023, 01:11 PM IST
Bomb Threat: బాంబులతో పేల్చేస్తామంటూ బెదిరింపు, మాస్కో-గోవా ఎమర్జన్సీ ల్యాండింగ్

మాస్కో-గోవా ఇంటర్నేషనల్ ఫ్లైట్ గుజరాత్ జామ్‌నగర్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జన్సీ ల్యాండ్ అయింది. 236 మంది ప్రయాణీకులున్న అజూర్ ఎయిర్ విమానాన్ని బాంబులతో పేల్చేస్తామని బెదిరింపులు రావడంతో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

మాస్కో నుంచి గోవా వస్తున్న అజూర్ ఎయిర్ విమానం బాంబు బెదిరింపు కారణంగా జామ్‌నగర్‌లోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.  విమానంలో 236 మంది ప్రయాణీకులున్నారు. విమానాన్ని తనిఖీ చేసేందుకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ బందం జామ్‌నగర్‌కు చేరుకుంది. విమానం ల్యాండ్ అయిన తరువాత 236 మందిని సురక్షితంగా తరలించారు. స్థానిక పోలీసులు, ఎన్‌ఎస్‌జి బృందం విమానం అణవణువూ గాలిస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా గోవా దబోలిమ్ విమానాశ్రయం పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.

ప్రజల రాకపోకల్ని పర్యవేక్షించేందుకు, అనుమానాస్పద కార్యకలాపాల్ని ట్రాక్ చేసేందుకు విమానాశ్రయంలో ప్రత్యేక బలగాల్ని మొహరించారు. బెదిరింపు ఫోన్ కాల్ గోవా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు వచ్చింది. బెదిరింపు కాల్ పుకారు కూడా కావచ్చని కానీ రిస్క్ తీసుకోదల్చుకోలేదని పోలీసులు తెలిపారు.

Also read: Vandebharat Express: విశాఖపట్నం వరకూ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు, ఎక్కడెక్కడ ఆగుతుందంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News