నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ( SSC ) జారీ చేసిన నోటిఫికేషన్ లో 283 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


జూనియర్ ట్రాన్స్ లేటర్-JHT 2020 నోటిఫికేషన్ ను ఎస్ఎస్ సీ విడుదల చేసింది. ఇందులో భాగంగా జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ తో పాటు  జూనియర్ ట్రాన్స్ లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ ఉద్యోగాలు ( jobs )  భర్తీ చేయనున్నారు. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పరిధిలో భర్తీ కానున్న ఈ పోస్టులకు చివరి తేదీ జూలై 25. దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్ లో మొత్తం 283 ఖాళీలున్నట్టు ప్రకటించారు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. గ్రూప్ బి నాన్ గెజిటెడ్ కేటగరీ కు చెందిన ఈ పోస్టుల వేతనాలు ఇలా ఉంటాయి. Also read: Sarkari Naukri 2020 : హిందుస్తాన్ షిప్‌యార్డ్‌ లిమిటెడ్ లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ



జూనియర్ ట్రాన్స్ లేటర్ పోస్టు లెవెల్ 6 కు 35,400 నుంచి 1,12,400 మధ్య ఉంటుంది.


సీనియర్  ట్రాన్స్ లేటర్ పోస్టుకు 44,900 నుంచి 1,42,400 వరకూ ఉంటుంది. 


జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ /  జూనియర్ ట్రాన్స్ లేటర్ పోస్టులు - 275


సీనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ పోస్టులు - 8


వయస్సు 18-30 సంవత్సరాల లోపు ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది. 


జూన్ 29 నుంచి ఈ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. జూలై 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ అప్లికేషన్లను స్వీకరిస్తారు. ఫీజు మాత్రం జూలై 27 రాత్రి వరకూ చెల్లించవచ్చు. హిందీలో మాస్టర్స్ డిగ్రీ లేదా డిప్లొమా ఉండి..ఇంగ్లీషు తప్పనిసరి అంశం కావాలి.  రెండు దశల్లో జరిగి రాత పరీక్ష విధానం ద్వారా ఎంపిక జరుగుతుంది. Also read: IRCTC Private Trains :  భారతీయ రైల్వేలో ప్రైవేట్ పెట్టుబడులకు ఆహ్వానం


ఇతర పూర్తి వివరాల కోసం http://ssc.nic.in వెబ్ సైట్ ను క్లిక్ చేయవచ్చు.