Rajinikanth: తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ అస్వస్థతకు లోనయ్యారు. రక్తపోటుతో బాధపడుతున్న రజినీకాంత్‌కు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళ  సూపర్‌స్టార్ రజినీకాంత్ ఆరోగ్యంపై ఆపోలో వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. రజినీకాంత్‌కు కరోనా లక్షణాల్లేవని..కానీ హైబీపీతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. రజినీకాంత్ గత పదిరోజులుగా అన్నాత్తై షూటింగ్ నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్నారు. కొద్దిరోజుల క్రితం యూనిట్‌లో కొద్దిమందికి కరోనా వైరస్ సోకడంతో..రజినీకాంత్ క్వారెంటైన్‌లో వెళ్లిపోయారు. డిసెంబర్ 22న పరీక్షలు చేయగా..నెగెటివ్ వచ్చింది. 


అయితే శుక్రవారం అంటే ఇవాళ ఒక్కసారిగా బీపీ పెరగడంతో అపోలో ఆసుపత్రిలో చేరారు. కరోనా లక్షణాల్లేవని..కానీ హైబీపీ ఉందన్నారు వైద్యులు. ప్రస్తుతం మందులతో బీపీను కంట్రోల్ చేస్తున్నామన్నారు. ఓ వైపు రాజకీయ పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన నేపధ్యంలో ఇప్పుడు ఆరోగ్యం పాడవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 


Also read: Ys jagan at Christmas: సొంతూరిలో ముఖ్యమంత్రి జగన్ క్రిస్మస్ వేడుకలు