Supreme Court On ICAI | CA పరీక్షల నిర్వహణపై కొనసాగుతున్న సందిగ్దతల మధ్య సుప్రీం కోర్టు ( Supreme Court ) కీలక ప్రకటన చేసింది. ప్రవేశ పరీక్షలకు హాజరు అయ్యే విద్యార్థులకు వారి ఎంపిక మేరకు పరీక్షలకు సిద్ధం చేయాలి అని తెలిపింది. అంతకు ముందు ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ ఎకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ( ICAI ) సుప్రీంకోర్టుతో... రానున్న సీఏ పరీక్షలను అన్‌లైన్‌లో నిర్వహించడం సాధ్యం కాదు అని.. ఎందుకంటే ఈ పరీక్షల ఆధారంగా విద్యార్థుల విశ్లేషణ సామర్థ్యాన్ని అంచనా వేస్తామని తెలిపింది. కరోనావైరస్ ( Coronavirus ) పరిస్థితుల వల్ల CA పరీక్షలను అన్‌లైన్‌లో నిర్వహించాల్సిందిగా కొంత మంది విద్యార్థులు కోరారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | AP Board of Intermediate: విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల


పిటీషన్ దాఖలు
మూడు గంటల పరీక్షల్లో వేరు వేరు పేటర్న్ పత్రాలను అందిస్తారు అని ICAI తెలిపింది. ఇందులో విద్యార్థులు టిక్ మార్కులు కొట్టకుండా వివరంగా సమాధానం రాయాల్సి ఉంటుంది. దీనిపై సుప్రిం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ICAI తీసుకుంటున్న చర్యలు సరైన విధంగా ఉన్నాయని తెలిపింది. దీంతో పాటు సర్వోన్నత న్యాయ స్థానం 21 నవంబర్ నుంచి 14 డిసెబర్ వరకు జరగాల్సిన CA పరీక్షలకోసం NOP సంబంధించిన అంవంపై కూడా స్పందించింది.



Also Read | TS High Court: అగ్రీగోల్డ్ కేసు విచారణను స్వీకరించిన తెలంగాణ హైకోర్టు


ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్డెర్డ్ ఎకౌంట్స్ ఆఫ్ ఇండియా ( ICAI ) నిర్వహించే పరీక్షల అడ్మిషన్ కార్డు కోసం విద్యార్థులు icaiexam.icai.org అనే సంస్థ అధికారిక పోర్టల్ విజిట్ చేయవచ్చు. ICAI నవంబర్ 2న జారీ చేసిన నోటీసు ప్రకారం విభిన్న కోర్సుల కోసం నవంబర్ 1న జారీ చేసిన సీఎ అడ్మిట్ కార్డు 2020 జారీ అయిన విద్యార్థుల్లో చాలా మంది కంటోన్మెంట్ జోన్ లో ఉన్నారని తెలిపింది.



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR