Cm jagan letter Row: సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానాన్ని స్వయంగా అధ్యక్షుడే వ్యతిరేకించారా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ వివాదం ఇంకా కొనసాగుతోంది. విభిన్నవర్గాలు విభిన్న అభిప్రాయాలు.. జగన్ లేఖను ఖండిస్తూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానించడంపై అదే సంఘం అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే తప్పుబట్టారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ వివాదం ( Ap cm ys jagan letter row ) ఇంకా కొనసాగుతోంది. విభిన్నవర్గాలు విభిన్న అభిప్రాయాలు.. జగన్ లేఖను ఖండిస్తూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానించడంపై అదే సంఘం అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే తప్పుబట్టారు.
ఏపీ హైకోర్టు ( Ap High court ) ను ప్రబావితం చేస్తున్నారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ( Supreme court justice n v ramana ) పై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( ap cm ys jagan ) సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ కు రాసిన లేఖ ప్రకంపనలు రేపుతూనే ఉంది. కొందరు సమర్ధిస్తుంటే మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు తాజాగా జగన్ లేఖను ఖండిస్తూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానం ( Supreme court bar association resolution ) చేసింది. అయితే ఇక్కడే మరో వివాదం రేగుతోంది.
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానాన్ని అదే బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే ( Supreme court bar association president Dushyant dave ) తీవ్రంగా ఖండించారు. సైద్ధాంతికంగా ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నానని దుష్యంత్ దవే స్పష్టం చేశారు. ఈ విషయలో బార్ అసోసియేషన్ ఓ వైపు, అధ్యక్షుడు మరోవైపుగా చీలిపోయారు.
బార్ అసోసియేషన్ తీర్మానం విషయంలో భాగస్వామిని కావడానికి తాను మొదట్నించీ తిరస్కరిస్తూ వచ్చానని, తీర్మానం విషయంలో జరిగిన సంప్రదింపుల్లో కూడా పాల్గొనలేదని ఆయన తేల్చిచెప్పారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ( Ap cm ys jagan letter row ) ఆరోపణల్లో నిజం ఎంత ఉందనేది మనకు తెలియదని.. విచారణ జరిగితే వాస్తవం అదే బయటపడుతుందన్నారు. ఈ దశలో మనం విచారణను ముందుకెళ్లకుండా అడ్డుకోలేమని చెప్పారు. ఈ పరిస్థితుల్లో సీఎం ఫిర్యాదును ఖండిస్తూ తీర్మానం చేయడం అపరిపక్వతే అవుతుందని దుష్యంత్ దవే చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి ( Arunachal pradesh cm suicide incident ) కలికోపాల్ ఆత్మహత్య లేఖను ప్రస్తావించారు. ఆయన ఆత్మహత్యకు కారణం ఇద్దరు జడ్జీలంటూ ఆరోపణలొచ్చినా వాటిపై ఎలాంటి విచారణ జరగలేదని గుర్తు చేశారు. మరోవైపు అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగాయ్ లైంగిక వేధింపుల ఆరోపణలను కూడా ఇందులో ప్రస్తావించారు. ఇలాంటి అంశాల్ని పరిగణలోకి తీసుకుని న్యాయవ్యవస్థను ఎలా బలోపేతం చేయాలన్న అంశంపై ఆత్మశోధన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని దవే తెలిపారు. Also read: Paytm Credit Charges: పేటీఎం 2 % క్రెడిట్ చార్జీ లేకుండా డబ్బు ఇలా బదిలీ చేసుకోవచ్చు
సుప్రీంకోర్టు ( Supreme court ) ఇప్పటికే అనేక వివాదాల్లో చిక్కుకుందని..ఇంకా నిర్దోషిత్వంతో బయటపడలేదని చెప్పారు. పూర్తి పారదర్శకత లేని వ్యవస్థ న్యాయవ్యవస్థేనన్న విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలన్నారు. తప్పు చేసిన జడ్జీలపై ఎన్నడూ చర్యలు తీసుకున్న దాఖలాల్లేవని..సుప్రీంకోర్టు ఎన్నడూ పారదర్శకంగా వ్యవహరించలేదని దుష్యంత్ దవే స్పష్టంగా చెప్పారు.
సీఎం జగన్ ఫిర్యాదు విషయంలో ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దుష్యంత్ దవే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ( Supreme court chief justice s a bobde ) అందులోని ఆరోపణలను పరిశీలించే అవకాశమిచ్చింది. అంతేకాకుండా న్యాయమూర్తుల ప్రవర్తనపై వచ్చే ప్రశ్నలకు సమాధానమిచ్చే ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని సైతం కల్పించిందన్న విషయాన్ని గమనించాలన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక వ్యక్తి.. మరో రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై తీవ్ర ఆరోపణలు చేసినప్పుడు వాటిని తప్పకుండా పరిశీలించాల్సిందేనన్నారు.
కచ్చితంగా ఏపీ సీఎం లేఖపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సరైన నిర్ణయం తీసుకుంటారనేది తన అభిప్రాయమని..లేఖను పక్కన పడేస్తారని తాననుకోవడం లేదని చెప్పారు. వైఎస్ జగన్ వివేకం కలిగిన రాజకీయ నేతగా, ఒక రాష్ట్ర సీఎంగా సరైన కారణాలతోనే లేఖ రాసి ఉంటారన్నారు. చాలా ఆలోచించాకే తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆ నిర్ణయం తీసుకుని ఉంటారని చెప్పారు. Also read: Delhi: అక్టోబర్ నెలలో కాలుష్యం ఎందుకు పెరుగుతుంటుంది?