Covid19 Death Certificate: కరోనా మహమ్మారి ఎందరో ప్రాణాల్ని హరించింది. నష్టపరిహారం కోసం మరణ ధృవీకరణ పత్రాల మంజూరు ప్రక్రియ ఆలస్యమవుతుండటంతో సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోవిడ్ 19 మహమ్మారితో(Corona Pandemic) ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించడం, మరణ ధృవీకరణ పత్రాల జారీకు మార్గదర్శకాలు(Covid19 Death Certificate Guidelines) రూపొందించడంలో తీవ్ర ఆలస్యమవుతోంది. ఫలితంగా బాధిత కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నష్టపరిహారం కోసం కోవిడ్ 19 డెత్ సర్టిఫికేట్ జారీకి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల్ని జారీ చేయాల్సిన అవసరముందంటూ కొందరు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై విచారణ జరిపిన జిస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుధ్ బోస్‌లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 


కరోనా మరణాలకు సంబంధించిన మార్గదర్శకాల్ని జారీ చేయాలంటూ గతంలోనే ఆదేశించామని కేంద్ర ప్రభుత్వానికి(Central Government) గుర్తు చేసింది సుప్రీంకోర్టు. తరువాత ఇదే అంశంపై గడువు కూడా పెంచామని..అయినా మార్గదర్శకాలు జారీ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్గదర్శకాలు జారీ చేసేటప్పటికి కరోనా థర్డ్‌వేవ్(Corona Third Wave) ముగిసిపోతుందని ఎద్దేవా చేసింది. చివరిగా సెప్టెంబర్ 11 లోగా మార్గదర్శకాల్ని రూపొందించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా కారణంగా మృతి చెందినవారి కుటుంబాలకు 4 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని కేంద్రం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టు మార్గదర్శకాల రూపకల్పన కోసం 2 సార్లు గడువు పొడిగించింది. కోవిడ్ డెత్ సర్టిఫికేట్ల జారీకు అవసరమైన మార్గదర్శకాలు లేకపోవడంతో సర్ఠిఫికేట్లు జారీ కాక..నష్టపరిహారం ఆలస్యమవుతోంది. అందుకే సుప్రీంకోర్టు (Supreme Court) అసహనం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదన విన్పించారు. 


Also read: INS Dhruv: ఇండియన్ నేవీకు మరో అస్త్రం, ఐఎన్ఎస్ ధ్రువ్ త్వరలో జాతికి అంకితం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook