Supreme Court: కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. సెలెబ్రిటీలు, ప్రముఖులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తికి కరోనా పాజిటివ్ గా తేలింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా కేసులు (Corona Virus) భారీగా పెరుగుతున్నాయి. రాజకీయనేతలు, ప్రముఖులు, సెలెబ్రిటీలు, మంత్రులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. సెకండ్ వేవ్‌లో ప్రముఖులు చాలామంది వైరస్ బారిన పడ్డారు. తాజాగా సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి జస్టిస్ డి వైచంద్రచూడ్‌ (Justice Chandrachud)కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయ‌న‌తోపాటు మ‌రో సిబ్బందికి కూడా కరోనా సోకినట్లు కోర్టు వ‌ర్గాలు తెలిపాయి. ఈ నేపధ్యంలో జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం కొన్ని రోజుల పాటు స‌మావేశం కాక‌పోవ‌చ్చ‌ని తెలుస్తోంది.


మ‌రోవైపు దేశంలో క‌రోనా సంక్షోభానికి (Corona crisis) సంబంధించిన అంశాల‌ను జ‌స్టిస్ చంద్ర‌చూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు (Supreme Court) ధ‌ర్మాస‌నం విచార‌ణ జ‌రుపుతోంది.ఈ పిటిష‌న్ల‌పై మే 13వ తేదీన విచార‌ణ జ‌రగాల్సి ఉంది. ఇప్పుడు ఆయ‌న అందుబాటులో లేకపోవ‌డంతో మ‌రో తేదీకి వాయిదా ప‌డే సూచనలు కన్పిస్తున్నాయి. జ‌స్టిస్ బాబ్డే పదవీ విరమణ తరువాత ఆయన నేతృత్వంలోని ధర్మాసనం వింటున్నకోవిడ్‌ కేసులను జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి మార్చారు. 


Also read: ICMR on Lockdown: లాక్‌డౌన్ తప్పిస్తే..పెను విధ్వంసమే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook