ICMR on Lockdown: దేశంలో కరోనా మహమ్మారి భయంకరంగా విజృంభిస్తోంది. రాష్ట్రాలు లాక్డౌన్ బాట పట్టాయి. ఈ నేపధ్యంలో ఐసీఎంఆర్ ఛీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా నియంత్రణకు లాక్డౌన్ ఒక్కటే ప్రత్యామ్నాయమంటున్నారు.
ఇండియాలో కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ధాటికి ప్రజానీకం విలవిల్లాడుతోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ ఆందోళన కల్గిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వైరస్ నియంత్రణకు రాష్ట్రాలు చాలా వరకూ లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. కేసుల సంఖ్య పెరిగే కొద్దీ ఆక్సిజన్ కొరత, బెడ్స్, అత్యవసర మందుల కొరత వేధిస్తోంది. ఈ క్రమంలో ఐసీఎంఆర్ (ICMR)ఛీఫ్ బలరామ్ భార్గవ్ దేశంలో అమలవుతున్న లాక్‌డౌన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోనూ ఇతర ప్రాంతాల్లోనూ ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్డౌన్ తొలగిస్తే పెను విధ్వంసం చోటు చేసుకుంటుందని అన్నారు.దేశంలో ముందుగా అధికంగా పాజిటివిటీ రేటున్న జిల్లాల్ని గుర్తించాలని..తరువాత ఆ ప్రాంతాల్లో కఠినంగా లాక్డౌన్ అమలు చేయాలన్నారు.
దేశంలోని 718 జిల్లాల్లో మూడింట నాలుగవవంతు టెస్ట్ పాజిటివిటీ రేటు 10 శాతం పైనే ఉందని..పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో కనీసం 8 వారాల లాక్డౌన్ విధించాలని ఐసీఎంఆర్ బలరామ్ భార్గవ్(Balaram Bhargav) సూచించారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో 90 శాతం అధిక పాజిటివిటీ నమోదవుతుందని చెప్పారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. ప్రభుత్వాలే కాకుండా ప్రజలు కూడా వైరస్ కట్టడికి నివారణ చర్యలు పాటిస్తూ..లాక్డౌన్(Lockdown)కు సహకరించాలని కోరారు. ఆర్ధిక ప్రభావం కారణంగా ప్రధాని మోదీ నరేంద్ర మోదీ లాక్డౌన్ విధించకుండా..రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలివేశారన్నారు.
Also read: BEL Jobs 2021: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్, తుది గడువు మే 19
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook