Supreme Court upholds UGC decision: న్యూఢిల్లీ: కరోనావైరస్ ( Coronavirus ) కారణంగా పలు రాష్ట్రాలు డిగ్రీ పరీక్షలను రద్దు చేస్తున్న క్రమంలో సుప్రీంకోర్టు ( Supreme Court ) కీలక వ్యాఖ్యలు చేసింది. చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను పాస్‌ చేయటం నిబంధనలకు విరుద్ధమని సుప్రీం పేర్కొంది. రాష్ర్టాలు, యూనివర్సిటీలు సెప్టెంబరు 30 లోపు చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహించి ఆ తర్వాతే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేయాలన్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ( UGC ) నిర్ణయాన్ని సమర్థిస్తూ ధర్మాసనం ఈ నిర్ణయాన్ని వెలువరించింది. అయితే యూజీసీ నిర్ణయానికి వ్యతిరేకంగా మహారాష్ట్రతోపాటు పలు రాష్ర్టాలు, వివిధ యూనివర్సిటీలకు చెందిన 31మంది విద్యార్థులు సుప్రీంకోర్టులో సవాలు చేయగా.. జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, జస్టిస్‌ ఆర్‌ఎస్‌ రెడ్డి, జస్టిస్‌ ఎంఆర్‌ షాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఇలా పేర్కొంది. Also read: Parliament Session: ఎంపీలందరికీ కరోనా పరీక్షలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెప్టెంబర్‌ 20లోపు కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించలేని పరిస్థితులు ఉంటే కొత్త షెడ్యూల్‌ కోసం యూజీసీని సంప్రదించాలని ఆయా రాష్ట్రాలకు సూచించింది.  విపత్తు నిర్వహణ చట్టం–2005 చట్టం కింద.. విద్యార్థులకు ఫైనలియర్‌ పరీక్షలు జరపకుండా డైరెక్టుగా పై తరగతులకు ప్రమోట్‌ చేసే అధికారం రాష్ట్రాలకు లేదని పేర్కొంది. అన్ని రాష్ట్రాలు యూజీసీ నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పును ప్రకటించింది. Also read: Apsara Rani: స్విమ్ డ్రెస్‌లో రెచ్చిపోయిన అప్సర


Also read: Seerat Kapoor: పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్ సోయగాలు