Cab Driver Prabhu Saves Injured Monkey's life with Emergency CPR: ప్రస్తుత ప్రపంచంలో మనిషి జీవితం ఉరుకులు, పరుగులు మీద గడుస్తుంది. కుటుంబం, ఉద్యోగంతో అందరూ బిజీబిజీగా గడుపుతున్నారు. పక్కింటివారికి ఏదైనా ఆపద వచ్చినా చూసీచూడన్నట్టు వెళ్లిపోతారు. ఇక రోడ్డుపై ప్రమాదం జరిగి ఓ వ్యక్తి  ఆపదలో ఉంటే.. సాయం చేయడానికి చాలామంది ఆలోచిస్తుంటారు. అలాంటిది రోడ్డుపై ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ కోతి (Monkey) ప్రాణాలను కాపాడాడు ఓ క్యాబ్ డ్రైవర్ (Cab Driver). కోతికి సీపీఆర్ (Emergency CPR) చేసి మరీ కాపాడాడు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు విషయంలోకి వెళితే... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం... తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం పెరంబలూర్‌ (Perambalur)లోని కున్నం తాలూకాకు చెందిన 38 ఏళ్ల ప్రభు (Prabhu) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. డిసెంబర్ 9న ప్రభు తన స్నేహితుడితో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. మార్గ మధ్యలో విశ్రాంతి తీసుకునేందుకు తన ద్విచక్రవాహనాన్ని కున్నం తాలూకాలోని ఒథియం సమతువపురంలో ఆపాడు. రోడ్డు పక్కనే భారీ చెట్టు ఉండడంతో ఇద్దరు కాసేపు సేద తీరుదామనుకున్నారు. అంతకుముందే కుక్కల గుంపు దాడిలో గాయాలు అయిన ఓ 10 నెలల కోతి చెట్టు పైకి ఎక్కింది. చాలా కుక్కలు ఆ వానరం కోసం చెట్టుకిందే ఉన్నాయి. 


Also Read: Rohit Sharma: కోహ్లీ కెప్టెన్సీ గురించి మొదటిసారి స్పందించిన రోహిత్.. ఇంతకీ ఏమన్నాడో తెలుసా?


ప్రభు (Prabhu), అతడి స్నేహితుడు చెట్టు వద్దకు రాగానే గాయాలతో సృహ కోల్పోయిన కోతి (Monkey) చెట్టుపై నుంచి కిందపడిపోయింది. ఇది గమనించిన ప్రభు కోతి వద్దకు వెళ్లి చూడగా.. అది ప్రాణాపాయ స్థితిలో ఉంది. వెంటనే కోతికి నీరు తాగించినా ఫలితం లేకపోయింది. దీంతో ప్రభు కోతిని వెటర్నరీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కోతి ఆరోగ్య పరిస్థితి విషమించింది. కోతి ఊపిరి పీల్చుకోవడం తగ్గిపోవడం చూసిన ప్రభు.. దాని గుండెను పంప్ చేయడం ప్రారంభించాడు. ఫలితం లేకపోవడంతో కోతికి సీపీఆర్ చేసి శ్వాస అందించాడు. దాంతో ఆ వానరం ఒక్కసారిగా సృహలోకి రావడంతో ప్రభు ఆనందపడిపోయాడు. 


Also Read: In pics: కార్తిక్ కుమార్, అమృత శ్రీనివాసన్ పెళ్లి ఫోటోలు వైరల్


ప్రభు అక్కడితో ఆగకుండా కోతి (Monkey)ని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు కోతికి చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. ఆపై క్యాబ్ డ్రైవర్ ప్రభు (Prabhu) 'ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌'తో మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశాడు. తాను 2010లో తంజావూరులో ప్రథమ చికిత్స శిక్షణా కోర్సును పూర్తి చేశానని, అది కోతిని రక్షించడంలో తనకు సహాయపడిందని చెప్పాడు. ప్రభు కోతిని కాపాడిన వీడియో నెట్టింట వైరల్ అయింది. వీడియో చూసిన వారు ప్రభుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'ప్రభు గ్రేట్', 'మంచి మనసున్న వ్యక్తి' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సుధా రామెన్ అనే ట్విట్టర్ యూసర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఇక ఆలస్యం ఎందుకు మీరూ ఆ వీడియో చూసేయండి. 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి