In pics: కార్తిక్ కుమార్, అమృత శ్రీనివాసన్ పెళ్లి ఫోటోలు వైరల్

Karthik Kumar, Amrutha Srinivasan wedding photos: తమిళ నటుడు, ఫేమస్ కమెడియన్ కార్తిక్ కుమార్, అమృత శ్రీనివాసన్ పెళ్లి చేసుకుని ఒక ఇంటి వారయ్యారు. చెన్నైలో జరిగిన ఈ పెళ్లికి ఇరుకుటుంబాల పెద్దలు, అతి కొద్ది మంది సమీప బంధుమిత్రులు హాజరైనట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో కార్తిక్ కుమార్, అమృత శ్రీనివాసన్ పెళ్లి ఫోటోలు వైరల్ అవుతుండటంతో వారి అభిమానులు వారికి కంగ్రాట్స్ చెబుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2021, 06:23 PM IST
In pics: కార్తిక్ కుమార్, అమృత శ్రీనివాసన్ పెళ్లి ఫోటోలు వైరల్

Karthik Kumar, Amrutha Srinivasan wedding photos: తమిళ నటుడు, ఫేమస్ కమెడియన్ కార్తిక్ కుమార్, అమృత శ్రీనివాసన్ పెళ్లి చేసుకుని ఒక ఇంటి వారయ్యారు. చెన్నైలో జరిగిన ఈ పెళ్లికి ఇరుకుటుంబాల పెద్దలు, అతి కొద్ది మంది సమీప బంధుమిత్రులు హాజరైనట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో కార్తిక్ కుమార్, అమృత శ్రీనివాసన్ పెళ్లి ఫోటోలు వైరల్ అవుతుండటంతో వారి అభిమానులు వారికి కంగ్రాట్స్ చెబుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

కార్తిక్ కుమార్ 2005 లో సింగర్ సుచిత్రను (Karthik Kumar's first wife Singer Suchitra) మొదటి పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత వారి కాపురంలో కలహాలు రావడంతో కొన్నేళ్ల క్రితమే ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. 

కార్తిక్ కుమార్, అమృత శ్రీనివాసన్ (Karthik Kumar, Amrutha Srinivasan love story) గత కొన్నేళ్లుగా ఒకరి గురించి మరొకరికి తెలిసి ఉన్నప్పటికీ.. ఇటీవలే ఈ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందని, ఆ ప్రేమే పెళ్లి వరకు దారి తీసిందని ఆ ఇద్దరికీ బాగా తెలిసిన సన్నిహిత మిత్రులు చెబుతున్నారు. 

Also read : Amazon prime Price hike: ప్రైమ్​ యూజర్లకు అమెజాన్ షాక్​- సబ్​స్క్రిప్షన్ ధరలు పెంపు

కార్తిక్ కుమార్, అమృత శ్రీనివాసన్‌ల బెస్ట్ ఫ్రెండ్ అయిన డిజిటల్ కాంటెంట్ క్రియేటర్ శ్రద్ధా ఇన్‌స్టాగ్రామ్‌లో వీరి పెళ్లి గురించి ఓ పోస్ట్ పెట్టారు. అతి కొద్దిమంది సన్నిహిత మిత్రుల మధ్యే ఈ పెళ్లి జరిగినట్టు శ్రద్ధానే తెలిపారు. 

A post shared by Shraddha (@aiyyoshraddha)

ఇద్దరు మంచి మనుషులకు పెళ్లి జరిగిందంటూ శ్రద్ధా తన ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చారు. అదే సమయంలో వారి పెళ్లి ఫోటోలను (Karthik Kumar, Amrutha Srinivasan wedding photos) పోస్టులో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

అన్నట్టు కార్తిక్ కుమార్ (Karthik Kumar wedding pics) ప్రస్తుతం దర్శకత్వంలో తన ప్రతిభను పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కార్తిక్ తొలిసారిగా డైరెక్ట్ చేసిన మూవీ కూడా త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రానుంది.

Also read : Pushpa Movie: Pushpa Pre Release Event Issue: పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై పోలీసుల ఆగ్రహం, కేసు నమోదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News