Corona Vaccine Updates: కోవిడ్-19 టీకా ముందుగా ఈ 30 కోట్ల మందికే, ఎవరికో తెలుసా ?
Covid-19 Vaccine Latest Updates | భారత దేశంలోని అనేక ప్రాంతాల్లో కోవిడ్-19 ( Covid-19 ) ప్రభావం నేటికీ కొనసాగుతోంది. 84 లక్షల మందికి కరోనాసోకగా 91 శాతానికిపైగా ప్రజలు కోలుకున్నారు. సుమారు లక్షా 25 వేల మంది ఇప్పటికే మరణించారు. కరోనావైరస్ వల్ల సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఇబ్బందిపడుతున్నారు.
Coronavirus Vaccine Updates | భారత దేశంలోని అనేక ప్రాంతాల్లో కోవిడ్-19 ( Covid-19 ) ప్రభావం నేటికీ కొనసాగుతోంది. 84 లక్షల మందికి కరోనాసోకగా 91 శాతానికిపైగా ప్రజలు కోలుకున్నారు. సుమారు లక్షా 25 వేల మంది ఇప్పటికే మరణించారు. కరోనావైరస్ వల్ల సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఇబ్బందిపడుతున్నారు. త్వరలో వ్యాక్సిన్ ( Corona Vaccine ) వస్తే అంతా సర్దుకుంటుంది అని అంతా భావిస్తున్నారు. ఇటీవలే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. హర్ష్ వర్ధన్ 2021 సెప్టెంబర్ లోపు సుమారు 30 కోట్ల మందికి కోవిడ్-19 టీకా ఇస్తామని తెలిపారు.
ALSO READ| Shopping Tips: కోవిడ్-19 సమయంలో మాల్ కి వెళ్తున్నారా ? ఇది చదవండి.
అయితే వ్యాక్సిన్ పంపిణీపై నిపుణులు కొన్ని సూచనలు జారీ చేశారు. వీటి ప్రకారం ముందు 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇస్తారు. ఇందులో డాక్టర్లు, ఎంబీబీఎస్ విద్యార్థులు కూడా ఉన్నారు. వీరితో పాటు మొత్తం నాలుగు వర్గాలుగా విభజించిన వారికి టీకాలు అందిస్తారు. అది కూడా ఉచితంగా.
ALSO READ| Covid-19 Symptoms: కరోనావైరస్ లక్షణాలు కనిపించేందుకు 8 రోజులు కూడా పట్టవచ్చు
1. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ (Healthcare Professionals):
వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే దేశంలో కోటికిపైగా ఉన్న హెల్త్ కేర్ ఫ్రొఫెషనల్స్ కు ఈ వ్యాక్సిన్ అందిస్తారు. ఇందులో వైద్యులు, నర్సులు, ఆశా కార్యకర్తలు, ఎంబీబీఎస్ విద్యార్థులు కూడా ఉన్నారు.
ALSO READ| Coronavirus in Kids: పిల్లలకు కరోనావైరస్...ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. పరిశోధకుల వెల్లడి
2. ఫ్రంట్ లైన్ వర్కర్స్ (Frontline workers):
కరోనావైరస్ ( Coronavirus) తో పోరాటం చేయడంలో నిమగ్నం అయిన 2 కోట్ల మంది కరోనా వారియర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన మున్సిపల్ సిబ్బంది, పోలీసు సిబ్బంది, సెక్యూరిటీ వంటి వారికి ఇస్తారు.
3. 50 ఏళ్లకు పైబడినవారికి (Senior Citizens):
50 సంవత్సరాలకు పైబడిన 26 కోట్ల మందికి వ్యాక్సిన్ అందిస్తారు. 50 ఏళ్లు నిండిన వారికి ప్రాధాన్యతను ఇస్తారు. ఎందుకంటే వీరికి కరోనావల్ల ఎక్కువ ముప్పు పొంచి ఉంది.
ALSO READ| Covid-19 Remedies: ఆవిరి చికిత్సతో కరోనావైరస్ ఖేల్ ఖతం... రీసెర్చ్ వెల్లడి
4. స్పెషల్ క్యాటగిరీ వారికి (Special Category People):
వీరిలో 50 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సులో ఉన్న ప్రత్యేక క్యాటగిరీ వ్యక్తులు అంటే ముందుగానే వైరస్ సోకిన వారికి, లేదా ఇతర వ్యాధులు ఉన్నవారికి అందిస్తారు.
ALSO READ| Immunity in Childrens: పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం ఇదే
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR