Coronavirus Latest Symptoms Updtes: కరోనావైరస్ లక్షణాలు ( Coronavirus Symptoms ) సాధారణంగా 3-4 రోజుల్లో కనిపిస్తాయి అని అందరికీ తెలిసిందే. ఆరోగ్య నిపుణులు కూడా అదే మాట చెప్పారు. ఇది గమనించి అనేక ప్రాంతాల్లో 3-5 రోజుల పాటు క్వారైంటైన్ అవ్వమని ( Quarantine ) చెబుతున్నారు. ఈ క్వారైంటైన్ సమయం లక్షణాలు లేని ( Asymptomatic ) వారి విషయం కొంచెం కఠినమైన అంశంగా మారింది. అయితే ఇటీవలే పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే..కరోనావైరస్ ( Coronavirus ) లక్షణాలు కనిపించేందుకు 8 రోజులు కూడా పడుతుందట.
చైనాలోని పెకింగ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన పరిశోధనలో సైంటిస్టులు పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు. కేవలం 3-4 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి అనేది ఇక పాత మాట అని.. కొన్ని సార్లు 8 రోజులకు కూడా లక్షణాలు బయటపడతాయి అని తెలిపారు. అందుకే క్వారైంటైన్ గడువును 8 రోజులకు పెంచాలంటున్నారు. చాలా మందిలో కోవిడ్-19 ఇన్ క్యూబేషన్ ( Covid-19 Inchubation ) సమయం 7.5 రోజులు ఉండగా... కొంత మందిలో 14-28 రోజుల సమయం పట్టింది అని తెలిపారు. అందుకే కరోనావైరస్ ( Covid-19 ) సోకినట్టు అనుమానిస్తున్న వారిని కనీసం 8-14 రోజులు క్వారైంటైన్ చేయాలంటున్నారు.