హైదరాబాద్: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. గాల్వన్ లోయ ఘర్షణల తర్వాత కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా కాంగ్రెస్ నాయకులు ఘాటు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రవిశంకర్ ప్రసాద్ ఎదురుదాడికి దిగారు. చైనా నిధులతోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తోందని అన్నారు. రాజీవ్ ట్రస్టుకు చైనా దౌత్య కార్యాలయం నుంచి నిధులు అందుతున్నాయని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ చైనాకు వత్తాసు పలుకుతోందని మండిపడ్డారు. Patanjali Coronavirus medicine: పతంజలి కరోనా మందు వివాదం ఏంటి ? ఎందుకు చర్చనియాంశమైంది ? )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు 


ఇదిలాఉండగా అంతకుముందు గాల్వన్ లోయ ఘర్షణల అనంతరం ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానిస్తూ, చైనా ఎలాంటి దురాక్రమణలకు పాల్పడలేదన్నారు. దురాక్రమణలకు పాల్పడకపోతే ఇంతమంది భారత సైనికులు ఎలా చనిపోయారని వారు చనిపోయింది ఎవరి భూభాగంలో అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సూటి ప్రశ్నలతో కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. దాంతో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. 
  Fruits and vitamins: ఈ పండ్లు తింటే ఇన్‌ఫెక్షన్, వైరస్‌లకు చెక్ పెట్టొచ్చు