Govt employees: ప్రభుత్వ ఉద్యోగులకు కొవిడ్-19 Paid leave ఇచ్చిన సీఎం
COVID-19 paid leave for virus affected govt employees: లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా సోకి బాధపడే వారికి, కరోనా సోకిన వారితో కాంటాక్టులోకి వచ్చిన కారణంగా క్వారంటైన్ (Quarantine) కావాల్సి వచ్చిన వారికి 28 రోజుల పాటు పెయిడ్ లీవ్‌కి దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తూ యూపీ సర్కారు ఆదేశాలు జారీచేసింది.
COVID-19 paid leave for virus affected govt employees: లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా సోకి బాధపడే వారికి, కరోనా సోకిన వారితో కాంటాక్టులోకి వచ్చిన కారణంగా క్వారంటైన్ (Quarantine) కావాల్సి వచ్చిన వారికి 28 రోజుల పాటు పెయిడ్ లీవ్‌కి దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తూ యూపీ సర్కారు ఆదేశాలు జారీచేసింది. ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన వారు, లేదా కరోనా సోకిన వారితో కాంటాక్టులోకి వచ్చి ఐసోలేట్ అవ్వాల్సి వచ్చిన వారికి ఈ 28 రోజుల పెయిడ్ లీవ్ (Paid leave) వర్తిస్తుంది. పది మంది లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో సిబ్బంది కలిగిన దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, ఫ్యాక్టరీలలో పనిచేసే వారికి కూడా ఈ పెయిడ్ లీవ్ వర్తిస్తుంది.
Also read : Customers రూ. 2 కోట్లు వరకు cash గెలుచుకునే ఆఫర్ అందిస్తున్న Indian oil
అయితే, ఈ పెయిడ్ లీవ్‌కి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు తిరిగి విధుల్లో చేరే ముందు తమ ఆరోగ్య పరిస్థితిని తెలిపే మెడికల్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని యూపీ సర్కార్ తమ ఆదేశాల్లో పేర్కొంది. కరోనాతో (COVID-19) నానా కష్టాలపాలవుతున్న ప్రస్తుత తరుణంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు యోగి సర్కార్ (UP CM Yogi Adityanath) తీసుకున్న ఈ నిర్ణయం ఆర్థికంగా కొంత ఉపశమనం ఇవ్వనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook