India Coronavirus Update: కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది.నిత్యం కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. వరుసగా నాలుగవ రోజు దేశంలో కేసుల సంఖ్య 3 లక్షలు దాటేసింది.రోజురోజుకూ దేశంలో కరోనా వైరస్ భయంకర రూపం దాల్చుతోంది.
కరోనా వైరస్ సెకండ్ వేవ్ (Corona Second Wave) విజృంభిస్తోంది. అత్యంత వేగంగా సంక్రమిస్తూ ప్రజల్ని వణికిస్తోంది. ఏ రోజుకారోజు కరోనా వైరస్ మహమ్మారి తీవ్రరూపం దాలుస్తోంది. మొన్నటి వరకూ రోజుకు 2 లక్షలు దాటి నమోదైన కేసులు గత 3-4 రోజుల్ని 3 లక్షలు దాటి నమోదవుతున్నాయి. ఇప్పుడు ప్రపంచంలో ఇండియాలోనే అత్యదికంగా కేసులు నమోదవుతున్న పరిస్థితి. తాజాగా గత 24 గంటల్లో కూడా ఇండియా మొత్తం కేసుల సంఖ్య 3.5 లక్షలకు చేరుకుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3 లక్షల 49 వేల 691 కొత్త కేసులు నమోదయ్యాయి.ఇప్పటివరకూ దేశంలో కేసుల సంఖ్య 1 కోటి 69 లక్షల 60 వేల 172కు చేరుకుంది. అటు కరోనా మృత్యుకేళి కూడా పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశంలో కరోనా కారణంగా 2 వేల 767మంది మరణించారు. దేశంలో ఇప్పటివరకూ కరోనా కారణంగా 1 లక్షా 92 వేల 311 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 26 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. 1 కోటి 40 లక్షల 85 వేల 110 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకూ 14 కోట్ల మందికి వ్యాక్సిన్ (Covid Vaccination) ఇచ్చారు.
Also read: Corona Second Wave: దేశంలో ప్రమాదకర స్థాయిలో కరోనా ఉధృతి, 24 గంటల్లో 3.5 లక్షల కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook