Customers రూ. 2 కోట్లు వరకు cash గెలుచుకునే ఆఫర్ అందిస్తున్న Indian oil

How to become a crorepati, 'Diesel bharo inaam jeeto' Indian oil says: తమ లక్కీ కస్టమర్స్‌కి లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా మారడానికి అద్భుతమైన అవకాశం అందిస్తోంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఏంటి, నమ్మడం లేదు కదా! ఇండియన్ ఆయిల్ ద్వారా మీకు లభించే ఈ అవకాశం మీకు భారీ మొత్తంలో లాభం తెచ్చిపెట్టవచ్చు. 

Last Updated : Apr 27, 2021, 05:47 PM IST
Customers రూ. 2 కోట్లు వరకు cash గెలుచుకునే ఆఫర్ అందిస్తున్న Indian oil

How to become a crorepati, 'Diesel Bharo Inaam Jeeto' Indian oil says: తమ లక్కీ కస్టమర్స్‌కి లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా మారడానికి అద్భుతమైన అవకాశం అందిస్తోంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఏంటి, నమ్మడం లేదు కదా! ఇండియన్ ఆయిల్ ద్వారా మీకు లభించే ఈ అవకాశం మీకు కోట్లు తెచ్చిపెట్టవచ్చు. ఇండియన్ ఆయిల్ ప్రకటించిన డీజిల్ భరో ఇనామ్ జీతో కాంటెస్టులో పాల్గొని గెలిస్తే.. ఆ కోటీశ్వరుడు (Lucky crorepati) మీరే కావొచ్చు. ఇండియన్ ఆయిల్ తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇంతకీ ఆ డబ్బు ఎలా గెలవాలో తెలియాలంటే ఇదిగో ఈ డీటేల్స్ చూడండి.

డీజిల్ భరో ఇనామ్ జీతో కాంటెస్టులో (Diesel Bharo Inaam Jeeto contest) భాగంగా ఏదైనా ఆథరైజ్డ్ ఆయిల్ పెట్రోల్ బంకు నుంచి మీ వాహనంలో 25 లీటర్ల డీజిల్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ 25 లీటర్లు ఒకే బిల్లులో ఉండాలి. ఆ తర్వాత డీలర్ కోడ్ <SPACE> బిల్ నంబర్ <SPACE> QUANTITY వివరాలను 77990 33333 నెంబర్‌కు SMS చేయాల్సి ఉంటుంది. జూలై 31 వరకు ప్రతీ వారం, రెండు వారాలు, నెల రోజుల చొప్పున బహుమతులు అందించనున్నట్టు ఇండియన్ ఆయిల్ తన ట్వీట్‌లో పేర్కొంది. 

ఈ ఆఫర్ 4 ఏప్రిల్ 2021 న ప్రారంభమైంది. 31 జూలై 2021 న అర్ధరాత్రి ముగుస్తుంది. 2021 జూలై 31 అర్ధరాత్రి 12 తర్వాత స్వీకరించిన ఎంట్రీలు పరిగణించబడవు అని ఇండియన్ ఆయిల్ స్పష్టంచేసింది.

Also read : IPL 2021: విదేశీ క్రికెటర్లకు BCCI గుడ్ న్యూస్, కంగారు పడొద్దని ఆటగాళ్లకు భరోసా

Diesel Bharo Inaam Jeeto offer గురించి ఇండియన్ ఆయిల్ చేసిన ట్వీట్ డీటేల్స్ ఇదిగో..

ఎవరు అర్హులు / Eligibility :
ఇండియాలో నివసిస్తున్న 18 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

ఒక నెంబర్ నుంచి రోజుకు రెండు ఎస్ఎంఎస్‌లు మాత్రమే అనుమతిస్తారు. అది కూడా రెండు వేర్వేరు బంకుల నుండి తీసుకున్న బిల్లులు కానీ లేదా ఒకే బంకు నుంచి రెండు వేర్వేరు నెంబర్స్ కలిగిన బిల్లులు కానీ అయ్యుండాలి.

SMS ఛార్జీలు:
మీరు వినియోగించే టెలికాం ఆపరేటర్ వసూలు చేసే SMS charges యధావిధిగా వర్తిస్తాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (Indian oil) స్పష్టంచేసింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News