ప్రధాని నరేంద్ర మోదీకి (Threat for PM Narendra Modi) హాని తలపెడతానంటూ బెదిరింపు కాల్ రావడంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తినంత పనైంది. పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ 100కు కాల్‌చేసి మరీ ప్రధాని మోదీకి హాని చేస్తానని ఓ యువకుడు పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో చోటుచేసుకుంది. రఫేల్‌ యుద్ధ విమానాలతో చైనాకు సంకేతాలు  
COVID19 Symptoms: కరోనా పేషెంట్లలో ముఖ్యమైన లక్షణాలివే


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హర్యానాకు చెందిన హర్భజన్ అనే యువకుడు నోయిడాలోని సెక్టార్ 66లో నివాసం ఉంటున్నాడు. ఎమర్జెన్సీ నెంబర్100కు కాల్ చేసిన హర్భజన్.. ప్రధాని మోదీకి హాని తలపెడతానని చెప్పాడు. ఫోన్ నెంబర్, లొకేషన్ గుర్తించిన లోకల్ ఫేజ్3 పోలీసులు గంటల వ్యవధిలో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. రానా ఇంట్లో సత్యనారాయణ వ్రతం, పూజలు


నిందితుడు డ్రగ్స్‌కు బానిస అయ్యాడని, మత్తులో ఫోన్ చేసి ఉంటాడని పోలీస్ అధికారి అంకుర్ అగర్వాల్ తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ప్రధాని మోదీకి హాని తలపెడతామని ఫోన్ కాల్ రావడం కొన్ని గంటలు కలకలం రేపింది. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...