నిరుద్యోగులకు యూపీఎస్‌సీ గుడ్ న్యూస్.. మీరు అప్లై చేశారా..?
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో సాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ ఏవియేషన్, ఎన్విరాన్‌మెంట్, డిఫెన్స్, మైనింగ్ వంటి విభాగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది.
Union Public Service Commission: తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. తెలుగు ప్రభుత్వాలు వెంట వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్స్ వేయడం లేదు. దాంతో కూడా నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఆ విషయం పక్కన పెడితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త నోటిఫికేషన్ ను జారీ చేయడం జరిగింది.
సివిల్ ఏవియేషన్, ఎన్విరాన్‌మెంట్, డిఫెన్స్, మైనింగ్ వంటి విభాగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది. జులై 22 నుండి ఈ అప్లికేషన్ పక్రియ మొదలు అవ్వబోతుంది. అభ్యర్థులు యూపీఎస్‌సీ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న వారు చాలా నెలలుగా ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది.
ఈ నోటిఫికేషన్ లో 26 ఏరోనాటికల్ ఆఫీసర్ ఉద్యోగాలు, ఒక ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్ పోస్ట్ లను భర్తీ చేసేందుకు అప్లికేషన్ లను స్వీకరిస్తున్నారు. సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్ట్ లు 20 ఉన్నట్లుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. వీటిని అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 40 ఏళ్ల లోపు ఉండాలి. ఈ నోటిఫికేషన్ లో మొత్తంగా 56 ఉద్యోగాలను యూపీఎస్‌సీ భర్తీ చేయబోతుంది.
గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్శిటీ నుండి మాస్టర్స్ డిగ్రీ లేదా అందుకు సమానమైన కోర్సును పూర్తి చేసి ఉండాల్సిందిగా అభ్యర్థులకు యూపీఎస్‌సీ తెలియజేసింది. సాధారణ డిగ్రీ ఉన్న వారికి ఈ నోటిఫికేషన్ ఉపయోగదాయకం కాదు.
Also Read: Fact Check: ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని డ్రైవ్ చేస్తే 20 వేల జరిమానా నిజమేనా
గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి ఫిజిక్స్, జియోఫిజిక్స్, జియాలజీ, మ్యాథమెటిక్స్ లో పీజీ చేయాల్సి ఉంది. అంతే కాకుండా ఎలక్ట్రానిక్స్ లో ఇంజనీరింగ్ ను పూర్తి చేసి ఉండాలి. సివిల్, కంప్యూటర్ సైన్స్ ఇంకా ఐటీల్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎంపిక అయిన అభ్యర్థులకు జీతం నెలకు రూ.21,000 నుంచి రూ.55,000 మధ్య ఉంటుంది.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు పొందే అన్ని వెసులుబాట్లు కూడా పొందవచ్చు. ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవాలి అంటే జనరల్, ఓబీసీ అభ్యర్థులు 25 రూపాయలు చెల్లించాల్సి ఉండగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళ అభ్యర్థులు ఫీజు ఏమీ చెల్లించకుండానే అప్లికేషన్ ను చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం మీరు కనుక అర్హులు అయి ఉంటే వెంటనే యూపీఎస్‌సీ వెబ్ సైట్ ని ఓపెన్ చేసి అప్లై చేసేయండి.
Also Read: Bhadrachalam: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మెుదటి ప్రమాద హెచ్చరిక జారీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి