Fact Check: ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని డ్రైవ్ చేస్తే 20 వేల జరిమానా నిజమేనా

Fact Check: ఏపీలో భరత్ అనే నేను సినిమా కన్పిస్తోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధించనున్నారు. ఇయర్‌ఫోన్స్ లేదా హెడ్ ఫోన్స్‌ తో డ్రైవింగ్ చేస్తే భారీ జరిమానా విధించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 26, 2023, 05:32 PM IST
Fact Check: ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని డ్రైవ్ చేస్తే 20 వేల జరిమానా నిజమేనా

Fact Check: ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ కొరడా ఝులిపిస్తోంది. భరత్ అనే నేను సినిమాలో మహేశ్ బాబు చేసినట్టుగా ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనపై ఉక్కుపాదం విధించేందుకు ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఇయిర్‌‌ఫోన్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తే 20 వేల జరిమానా విధించనుంది. కొద్దిరోజూల్నించి ఇదే ప్రచారం ఊపందుకుంది. ఇందులో నిజానిజాలేంటో పరిశీలిద్దాం..

ఏపీలో ట్రాఫిక్ నియమాల పాలనపై రవాణా శాఖ కట్టుదిట్టంగా వ్యవహరిస్తోందని..కొత్తగా భారీ జరిమానాలు విధించిందనే ప్రచారం గత రెండ్రోజుల్నించి నడుస్తోంది. బైక్, కారు, ఆటోలో ఇయర్‌ఫోన్స్ లేదా హెడ్‌సెట్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే 20 వేల రూపాయలు జరిమానా విధిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆగస్టు నెల నుంచి కొత్త జరిమానాలు అమల్లోకి రానున్నాయనే ప్రచారం కూడా కొనసాగుతోంది. ఈ వార్తలు పెద్దఎత్తువ షేర్ అవుతున్నాయి. వైరల్ అవుతోంది. ఈ భారీ జరిమానాలపై జనంలో కలకలం కూడా ప్రారంభమైంది. ప్రభుత్వంపై విమర్శలు కూడా మొదలెట్టేశారు. 

రోజురోజుకీ ఈ ప్రచారం శృతి మించుతుండటంతో ఏపీ రవాణా శాఖ స్పందించింది. ఇయర్‌ఫోన్స్ లేదా హెడ్‌సెట్స్ పెట్టుకుని డ్రైవ్ చేస్తూ పట్టుబడితో 20 వేల జరిమానా విధించనున్నారనే ప్రచారం అబద్ధమని తేల్చిచెప్పింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని రవాణా శాఖ కోరింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు రాష్ట్రంలో గతంలో సవరించిన జరిమానాలే వసూలు చేస్తున్నామని..ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని డ్రైవ్ చేస్తూ పట్టుబడితే 1500 నుంచి 2000 జరిమానా విధిస్తున్నామని రవాణా శాఖ వెల్లడించింది. ఈ జరిమానా కూడా కొత్తగా వసూలు చేయడం లేదని గతంలో ఉన్నదేనని తెలిపింది. ఈ జరిమానా పెంచే ఆలోచన కూడా లేదని స్పష్టం చేసింది. 

ఏపీ రవాణా శాఖ స్పష్టతతో ఈ ప్రచారమంతా ఫేక్ అని నిర్ధారణైంది. ఉద్దేశ్యపూర్వకంగా కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెల్లడైంది. ఒకే వ్యక్తి పదే పదే ్దే తప్పు చేసి పట్టుబడుతుంటే గరిష్టంగా పది వేల జరిమానా ఉంది.

Also read: Ap Heavy Rains: ఏపీలో జూలై 29 వరకూ అతి భారీ వర్షాలు, ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News