Bhadrachalam: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మెుదటి ప్రమాద హెచ్చరిక జారీ..

Godavari Water flow: కుండపోత వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అక్కడ సాయంత్రానికి నీటిమట్టం 44.4 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 26, 2023, 04:01 PM IST
Bhadrachalam: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మెుదటి ప్రమాద హెచ్చరిక జారీ..

Godavari water level at Bhadrachalam: భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం (Godavari water level at Bhadrachalam) క్రమంగా పెరుగుతోంది. ఇవాళ ఉదయం 40 అడుగులుగా ఉన్న నీటిమట్టం.. సాయంత్రం 3.30 గంటలకు 44.4 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 

ఎగువన ఉన్న తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో అధికారులు గేట్లుఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. తాజాగా 23 గేట్లు ఎత్తి.. లక్షా 80వేల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న గోదావరిలోకి విడుదల చేశారు. నేటి సాయంత్రం లేదా రాత్రికల్లా రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. గోదావరి ప్రవాహం 43 అడుగులకు చేరితే మెుదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 

గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య విజ్ఞప్తి చేశారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునారావస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. ముంపు గ్రామాలను నిరంతరం పర్యవేక్షించడంతోపాటు భద్రాచలం-చర్ల రోడ్డుపై రాకపోకలు నియంత్రించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎమెర్జన్సీ అయితే కంట్రోల్ రూమ్ కు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు. తెలంగాణలో మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Also Read: Telangana Rains: తెలంగాణలో వరుణుడి బీభత్సం.. భారీగా పంట నష్టం.. ఇవాళ, రేపు విద్యాసంస్థలకు సెలవులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News