Joe Biden Nominates Ajay Banga as a World Bank President: వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ పోస్టుకు భారత సంతతికి చెందిన వ్యక్తి అజయ్ బంగ పేరును నామినేట్ చేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. మాస్టర్ కార్డ్ సంస్థ మాజీ సీఈఓ అయిన అజయ్ బంగకు ఈ క్లిష్టమైన సమయంలో వరల్డ్ బ్యాంకుకు నేతృత్వం వహించే అన్ని అర్హతలు ఉన్నాయని జో బైడెన్ అన్నారు. గత మూడు దశాబ్ధాలుగాపైగా ఎన్నో వరల్డ్ క్లాస్ సంస్థలను తయారుచేసి, భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలు సృష్టించడమే కాకుండా ఆయా సంస్థలో విజయపంథాలో నడిపించిన సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యువర్‌గా అజయ్ బంగకు పేరుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుత వరల్డ్ బ్యాంకుకు డేవిడ్ మల్పస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. డేవిడ్ ఐదేళ్ల పదవీ కాలంలో మరో ఏడాది మిగిలి ఉంది. కానీ జూన్ ఆఖరుకల్లా తాను ఈ పదవి బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్టు డేవిడ్ మల్పస్ గతంలోనే ప్రకటించారు. ఎప్పుడైతే డేవిడ్ మల్పస్ ఈ ప్రకటన చేశారో అప్పటి నుంచే ఆ పోస్టుకు నామినేషన్స్ పై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. గతేడాది ఓ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సందర్భంగా డేవిడ్ మల్పస్ మాట్లాడుతూ.. గ్లోబల్ వార్మింగ్ కి కారణాలపై పొరపాటున తప్పుగా మాట్లాడి విమర్శపాలయ్యారు. ఆ తరువాత తన తప్పు తెలుసుకున్న డేవిడ్.. పొరపాటైంది అని ప్రపంచానికి క్షమాపణలు చెప్పారు. పొరపాటున జరిగిన ఈ ప్రమేయం డేవిడ్ ని బాగా కుంగదీసింది అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 


ఇక అజయ్ బంగ విషయానికొస్తే.. ఇండియన్ అమెరికన్ అయిన అజయ్ బంగ ప్రస్తుతం జనరల్ అట్లంటిక్ అనే ఈక్విటి ఫమ్‌కి వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న పర్యావరణం వంటి సమస్యలపై అజయ్ బంగకు పట్టుందని.. అందుకే ప్రపంచ బ్యాంకును ముందుండి నడిపించగల సమర్ధత కూడా అజయ్ బంగకు ఉందని.. అందుకే ఆయన్ని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి పదవికి నామినేట్ చేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. 


ట్రెజరి సెక్రెటరి జానెట్ యెల్లెన్ మాట్లాడుతూ.. వరల్డ్ బ్యాంక్ లక్ష్యాలను సాధించడంతో పాటు ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను అధిగమించగల సత్తా అజయ్ బంగాకు ఉందని ధీమా వ్యక్తంచేశారు. అమెరికా క్లైమేట్ ఎన్వాయ్ జాన్ కెర్రి మాట్లాడుతూ.. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ పోస్టుకు అజయ్ బంగానే సరైన ఎంపిక అని అభిప్రాయపడ్డారు. మొత్తానికి అగ్రరాజ్యమైన అమెరికా ఎలాంటి జాతి వివక్షకు తావులేకుండా ప్రపంచంలోనే అత్యున్నత స్థానాల్లో ఒకటైన ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ పదవికి భారత సంతతి వ్యక్తి అయిన అజయ్ బంగాను నిష్పక్షపాతంగా నామినేట్ చేయడం గొప్ప విషయమే. ఈ పరిణామంతో మరోసారి భారత సంతతి వ్యక్తి పేరు న్యూస్ హెడ్‌లైన్స్‌లో నిలిచింది.


ఇది కూడా చదవండి : Who is Vivek Ramaswamy: వివేక్ రామస్వామి.. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మరో అమెరికన్ ఇండియన్ 


ఇది కూడా చదవండి : Woman Locked Herself: మూడేళ్లుగా ఇంట్లోనే తల్లీ, కొడుకు.. ఇంటికి తాళం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


యాపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook