Woman Locked Herself: మూడేళ్లుగా ఇంట్లోనే తల్లీ, కొడుకు.. ఇంటికి తాళం

Woman Locked Herself in House: గత మూడేళ్లుగా తన కొడుకుతో పాటు తనను తాను ఇంట్లోనే స్వీయ నిర్భందం చేసుకుంది ఓ మహిళ. అంతేకాదు.. ఉద్యోగం కోసం ఇంటి నుంచి బయటికెళ్లిన భర్తను కూడా ఆమె గత మూడేళ్లుగా తిరిగి ఇంట్లో కాలు పెట్టనివ్వలేదు. ఎందుకిలా చేసిందామె ? కారణం ఏంటి ?  

Written by - Pavan | Last Updated : Feb 23, 2023, 07:50 AM IST
Woman Locked Herself: మూడేళ్లుగా ఇంట్లోనే తల్లీ, కొడుకు.. ఇంటికి తాళం

Woman Locked Herself in House: కరోనా భయం అనేది ఇప్పుడు అందరికీ ఓ గతం.  కరోనావైరస్ భయానికి దూరంగా.. ఒకరికొకరు దగ్గరిగా బతకడం మొదలుపెట్టి చాలా కాలమే అయింది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళను మాత్రం ఇంకా కరోనా భయం వీడలేదు. కరోనావైరస్ తమను ఎక్కడ మింగేస్తుందో అనే భయం ఆమెను ఇప్పటికీ వెంటాడుతోంది. అందుకే ఆమె గత మూడేళ్లుగా తనని తాను ఇంట్లో నిర్భందించుకుంది. తనతో పాటు తన 10 ఏళ్ల కొడుకును కూడా ఇంట్లోనే బంధించుకుంది. 

ఆమె అంతటితో సరిపెట్టుకోలేదు.. 2020 లో ఫస్ట్ లాక్‌డౌన్ ఎత్తేసిన తరువాత ఉద్యోగం కోసం ఇంటి నుంచి బయటికెళ్లిన భర్తను కూడా ఆమె తిరిగి ఇంట్లో కాలు పెట్టనివ్వలేదు. గురుగ్రామ్‌లోని మారుతి కుంజ్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లోనే మూడేళ్లుగా స్వీయ నిర్భందంలో ఉన్న మహిళను మున్మున్ మాఝిగా గుర్తించారు.  

ఆమ భర్త పేరు సుజన్ మాఝీ. వృత్తిరీత్యా ఇంజనీర్. భార్య మున్మున్ తనని కూడా ఇంట్లోకి రానివ్వకపోవడంతో మొదట్లో కొన్నాళ్ల పాటు తన బంధువులు, స్నేహితుల వద్ద ఆశ్రయం పొందాడు. ఆ తరువాత ఎంత నచ్చచెప్పినా ఆమె వినలేదు. తన అత్తమామల సహాయం కూడా తీసుకున్నాడు. అయినా మున్మున్ మనసు మారలేదు. దీంతో ఇక తనకు ఇంట్లో చోటుపై ఆశ కొట్టేసుకున్న సుజన్.. మరో ఇల్లు అద్దెకు తీసుకుని వేరుగా నివాసం ఉండటం మొదలుపెట్టాడు. తన భార్య, కొడుకు ఉంటున్న ఇంటికి కూడా అద్దె చెల్లిస్తూ వారికి అవసరమైన అన్ని నిత్యావసర సరుకులు అందిస్తూ రోజులు వెళ్లదీస్తూ వచ్చాడు. ఆన్ లైన్లోనే విద్యను అభ్యసిస్తున్న కొడుక్కు స్కూల్ ఫీజు చెల్లించడం కూడా చేశాడు. గ్యాస్ సిలిండర్ మార్చడం కూడా ఇష్టపడని మున్మున్.. ఇండక్షన్ హీటర్‌పై వంట చేయడం మొదలుపెట్టింది.

ఇలా మూడేళ్లు గడవడంతో మరో ప్రయత్నంగా భార్యగా నచ్చచెప్పి చూశాడు. అయితే, తన కొడుక్కు కరోనా వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం వచ్చేంత వరకు తాను బయటికి వచ్చేది లేదని తెగేసి చెప్పింది. కానీ ఆమె కొడుక్కి ప్రస్తుతం 10 ఏళ్లే కావడంతో చట్టరీత్యా అధికారికంగా అది సాధ్యపడే పరిస్థితి లేదు. దీంతో ఇక చేసేదేం లేక సుజన్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు హెల్త్ కేర్ సిబ్బందికి, బాలల సంరక్షణ విభాగం అధికారులకు సమాచారం అందించారు. పోలీసుల సహాయంతో మెడికల్ విభాగం, బాలల సంరక్షణ విభాగం అధికారులు ఆమె ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె ఎంతకీ తలుపు తెరిచేందుకు ఒప్పుకోకపోవడంతో పోలీసులు తలుపులు బద్ధలుకొట్టి లోపలికి ప్రవేశించి సుజన్ భార్యను, కొడుకుని రక్షించారు. వారికి తక్షణ వైద్య సహాయం కోసం వారిని ఆస్పత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి : Rohini Sinduri vs Roopa Moudgil: ఐఏఎస్ vs ఐపిఎస్ వివాదం ఏ టు జడ్ మొత్తం ఎపిసోడ్.. కళ్లకు కట్టినట్టుగా..

ఇది కూడా చదవండి : Glamorous Women Politicians: తమను తాము ప్రూవ్ చేసుకున్న గ్లామరస్ లేడీ పొలిటిషియన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

యాపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News