Who is Vivek Ramaswamy: వివేక్ రామస్వామి.. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మరో అమెరికన్ ఇండియన్

Who is Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిక్కీ హేలీకి పోటీగా మరో భారత సంతతికి చెందిన ప్రముఖ బిజినెస్‌మేన్ వివేక్ రామస్వామి వచ్చి చేరారు. తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవనున్నట్టు వివేక్ రామస్వామి ప్రకటించారు. దీంతో ఈ రేసులో నిలిచిన రెండో ఇండియన్ అమెరికన్‌గా వివేక్ రామస్వామి వార్తల్లోకెక్కారు.

Written by - Pavan | Last Updated : Feb 23, 2023, 07:58 AM IST
Who is Vivek Ramaswamy: వివేక్ రామస్వామి.. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మరో అమెరికన్ ఇండియన్

Who is Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచే భారత సంతతి వ్యక్తుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే 2024 లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలబడనున్నట్టు భారత సంతతి మహిళ నిక్కీ హేలీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమెకు పోటీగా మరో భారత సంతతి వ్యక్తి వివేక్ రామస్వామి వచ్చి చేరారు. తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవనున్నట్టు వివేక్ రామస్వామి ప్రకటించారు. దీంతో ఈ రేసులో నిలిచిన రెండో ఇండియన్ అమెరికన్‌గా వివేక్ రామస్వామి వార్తల్లోకెక్కారు. 

ఇంతకీ ఎవరు ఈ వివేక్ రామస్వామి ?
వివేక్ రామస్వామి అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో సిన్‌సిన్సాటిలో జన్మించారు. వివేక్ రామస్వామి తల్లిదండ్రులు కేరళలోని పాలక్కడ్ జిల్లా వడక్కెంచెరిలో జన్మించారు. వివేక్ రామస్వామి తండ్రి వి.జి. రామస్వామి కేరళలోనే ఓ స్థానిక కాలేజీలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తిచేసిన అనంతరం ఉద్యోగరీత్యా అమెరికాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వి.జి. రామస్వామి ఓహియోలోని ఇవెండేల్‌లో ఉన్న జనరల్ ఎలక్ట్రిక్ ప్లాంట్‌లో ఉద్యోగ అవకాశం రావడంతో అక్కడికి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. 

వివేక్ రామస్వామి విద్యార్హతల విషయానికొస్తే.. సిన్‌సినాటిలోని సేంట్ జేవియర్ హై స్కూల్ నుంచి 2003 లో డిప్లొమా పట్టా పొందారు.     హైస్కూల్ రోజుల్లోనే మెరిట్ స్టూడెంట్ అని ప్రశంసలు అందుకున్నారు.  చదువుకునే రోజుల్లోనే పియానిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న వివేక్ రామస్వామికి టెన్నిస్‌లోనూ ప్రావీణ్యం ఉంది. అమెరికాలో జాతీయ స్థాయిలో జూనియర్ టెన్నిస్ ప్లేయర్‌గా పేరు సంపాదించుకున్నారు. 

2014లో రోవియంట్ సైన్సెస్ ప్రారంభం.. అనతి కాలంలోనే సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యువర్‌గా ప్రశంసలు
2014లో వివేక్ రామస్వామి తనే సొంతంగా రోవియంట్ సైన్సెస్ అనే హెల్త్‌కేర్ ఫార్మా కంపెనీని ప్రారంభించారు. ఔషదాల తయారీలో అధునాతన పోకడలే తమ లక్ష్యం అని ప్రకటిస్తూ ఈ కంపెనీని స్థాపించిన వివేక్ రామస్వామి.. అనతి కాలంలోనే సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యువర్ అనిపించుకున్నారు. 

అంతేకాదు.. 2015 లో వివేక్ రామస్వామి గురించి ప్రముఖ ఫోర్బ్స్ మేగజైన్ ఏకంగా ఒక కవర్ పేజీ కథనాన్నే ప్రచురించింది. 30 ఏళ్ల వయస్సులోనే వివేక్ రామస్వామి ఔషద తయారీ సంస్థలను ఏలుతున్న సీఈఓగా ఆ కథనం అభివర్ణించిందంటే అమెరికాలో అతడి సక్సెస్ ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. 2021 లో రోవియంట్ సైన్సెస్ సీఈఓ పోస్ట్ నుంచి తప్పుకున్న వివేక్ రామస్వామి.. అమెరికాకే చెందిన మరో బడా వ్యాపారవేత్త పీటర్ థీల్‌తో కలిసి స్ట్రైవ్ అసెట్ మేనేజ్మెంట్ అనే కంపెనీని స్థాపించారు. 2014 లో స్థాపించిన తన సొంత కంపెనీనే 2015లో ఐపీఓకు తీసుకొచ్చి, అమెరికన్ స్టాక్ మార్కెట్లో  విజయవంతమైన వ్యాపార సంస్థగా నిలిపిన అనుభవంతోనే వివేక్ రామస్వామి ఈ స్ట్రైవ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని ప్రారంభించారు.

ఇది కూడా చదవండి : UPI Transactions News: యూపీఐ పేమెంట్స్ ఇప్పుడు ఇలా కూడా చేయొచ్చు

ఇది కూడా చదవండి : Fake Passport Alert: పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసే వాళ్లు తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం

ఇది కూడా చదవండి : Tata Tiago Car: జనం కళ్లు మూసుకుని కొంటున్న చీప్ అండ్ బెస్ట్ టాటా కారు ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

యాపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News